నిర్మల్: బాలుడిపై అత్యాచారం, హత్య..నిందితుడికి యావజ్జీవ శిక్ష

నిర్మల్: బాలుడిపై అత్యాచారం, హత్య..నిందితుడికి యావజ్జీవ శిక్ష

నిర్మల్, వెలుగు: నిర్మల్ మండలంలోని చిట్యాల గ్రామంలో ఓ మైనర్ బాలుడిపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడు తోకల రాజేశ్వర్ కు యావజీవ కారాగార శిక్షతోపాటు రూ.3 వేల జరిమానా విధిస్తూ జిల్లా జడ్జి శ్రీవాణి తీర్పు వెలువరించారు. గతేడాది రాజేశ్వర్​గ్రామానికి చెందిన ఓ బాలుడిని నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి ఆపై గొంతునులిమి హత్య చేశాడు. 

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి రాజేశ్వర్​ను అదుపులోకి తీసుకున్నారు. తాజాగా అతడిని కోర్టులో ప్రవేశపెట్టగా నిందితుడికి జడ్జి శ్రీవాణి శిక్ష ఖరారు చేశారు. ఈ కేసులో నిందితుడికి శిక్ష పడేలా చేసిన పోలీసులను ఎస్పీ జానకీ షర్మిల అభినందించారు.