ఇంజినీరింగ్ చేశారా ? HALలో 120 ట్రైనీ పోస్టులు.. మంచి జీతం, అర్హతలు, పూర్తి వివరాలు ఇవే !

ఇంజినీరింగ్ చేశారా  ? HALలో 120 ట్రైనీ పోస్టులు.. మంచి జీతం, అర్హతలు, పూర్తి వివరాలు ఇవే !

హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్  (హెచ్ఏఎల్) డిజైన్ ట్రైనీ/ మేనేజ్ మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ ఆగస్టు 14.

పోస్టు పేరు: డిజైన్ ట్రైనీ (డీటీ), మేనేజ్​మెంట్ ట్రైనీ (ఎంటీ). 

మొత్తం ఖాళీలు: 120. 

విభాగాల వారీగా ఖాళీలు 
డిజైన్ ట్రైనీ: ఏరోనాటికల్ 4, ఎలక్ట్రికల్ 7, ఎలక్ట్రానిక్స్ 20, ఇనుస్ట్రుమెంటేషన్ 3, మెకానికల్ 22, కంప్యూటర్ సైన్స్ 3, మెటలార్జీ 1.

మేనేజ్​మెంట్ ట్రైనీ: ఎలక్ట్రికల్ 11, ఎలక్ట్రానిక్స్ 12, మెకానికల్ 27, కంప్యూటర్ సైన్స్ 1, మెటలార్జీ 2, ప్రొడక్షన్ 5, సివిల్ 2. 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ లేదా టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ లేదా సమాన కోర్సు పూర్తిచేసి ఉండాలి. గ్రాడ్యుయేషన్​లో అన్ రిజర్వ్డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 70 శాతం, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. 

గరిష్ట వయోపరిమితి: 2026, ఆగస్టు 14వ తేదీ నాటికి 28 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు, ఎక్స్ సర్వీస్​మన్ అభ్యర్థులకు ఐదేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: జులై 29.

అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీలకు అప్లికేషన్ ఫీజు లేదు. ఇతరులు రూ.500 చెల్లించాలి. 

లాస్ట్ డేట్: ఆగస్టు 14. 

ఆన్​లైన్ టెస్ట్: సెప్టెంబర్ 5, 6.

ఫలితాల వెల్లడి: సెప్టెంబర్ 10. 

ఇంటర్వ్యూ తేదీలు: సెప్టెంబర్ 21 నుంచి 25  వరకు. 

మెడికల్ ఎగ్జామినేషన్: అక్టోబర్ 9 నుంచి 15 వరకు. 

సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ hal-india.co.inను సందర్శించండి. 

ఎగ్జామ్ ప్యాటర్న్
ఆన్​లైన్ పద్ధతిలో నిర్వహించే రాత పరీక్షలో ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఇస్తారు. మొత్తం 160 ప్రశ్నలు ఇస్తారు. 150 నిమిషాల్లో పూర్తిచేయాల్సి ఉంటుంది. పార్ట్–Iలో జనరల్ అవేర్​నెస్ నుంచి 20 ప్రశ్నలు 20 మార్కులకు, పార్ట్–IIలో ఇంగ్లిష్​ & రీజనింగ్ నుంచి 40 ప్రశ్నలు 40 మార్కులకు, పార్ట్–IIIలో సంబంధిత ఇంజినీరింగ్ విభాగం నుంచి 100 ప్రశ్నలు 100 మార్కులకు అడుగుతారు. 

ఇంటర్వ్యూ: రాత పరీక్షలో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులను బెంగళూరులో జరిగే పర్సనల్ ఇంటర్వ్యూకి ఆహ్వానిస్తారు.

వెయిటేజీ: ఫైనల్ మెరిట్ లిస్ట్ తయారీలో ఆన్‌‌‌‌లైన్ పరీక్షకు 85 శాతం, ఇంటర్వ్యూకి 15 శాతం వెయిటేజీ ఇస్తారు.

అర్హత మార్కులు: రాత పరీక్ష, ఇంటర్వ్యూ రెండింటిలోనూ అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులు సాధించాలి. రిజర్వ్​డ్ కేటగిరీల అభ్యర్థులకు నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది.