ఐస్‌‌‌‌క్రీమ్‌‌‌‌లో ఈగ.. స్వీట్‌‌‌‌ హౌస్‌‌‌‌ లో కొనుగోలు.. మంచిర్యాల జిల్లా తాండూర్ లో ఘటన

ఐస్‌‌‌‌క్రీమ్‌‌‌‌లో ఈగ..  స్వీట్‌‌‌‌ హౌస్‌‌‌‌ లో కొనుగోలు.. మంచిర్యాల జిల్లా తాండూర్ లో ఘటన

బెల్లంపల్లి రూరల్, వెలుగు: మంచిర్యాల జిల్లా తాండూర్ మండలకేంద్రంలోనిఓ స్వీట్‌‌‌‌హౌస్‌‌‌‌లో కొనుగోలు చేసిన ఐస్‌‌‌‌క్రీమ్‌‌‌‌లో ఈగ కనిపించడంతో కలకలం రేగింది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా గోలేటీ గ్రామానికి చెందిన తిరుపతి మండలకేంద్రంలోని బాలాజీ దేవ్‌‌‌‌నారాయణ స్వీట్‌‌‌‌హౌస్‌‌‌‌లో శివశక్తి కంపెనీకి చెందిన చాకోబార్ ఐస్‌‌‌‌క్రీమ్ కొన్నాడు. తిరుపతి కొడుకు ఐస్​క్రీమ్​ తింటుండగా అందులో చనిపోయిన ఈగ కనిపించింది. బాధితుడు ఫుడ్ ఇన్‌‌‌‌స్పెక్టర్‌‌‌‌తో పాటు స్థానిక పోలీస్‌‌‌‌స్టేషన్‌‌‌‌లో ఫిర్యాదు చేశాడు.