అక్రమ మద్యం సప్లై చేస్తే పీడీ యాక్ట్ :  మంత్రి శ్రీనివాస్ గౌడ్

అక్రమ మద్యం సప్లై చేస్తే పీడీ యాక్ట్ :  మంత్రి శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్, వెలుగు: ముషీరాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో హర్యానా రాష్ట్రానికి చెందిన 339 బాటిల్​ల అక్రమ మద్యంను స్వాధీనం చేసుకొని రాష్ట్రంలో మొదటిసారి పీడీ యాక్ట్ కేసు నమోదు చేసినట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

 జార్ఖండ్​కు చెందిన రాజారామ్ సింగ్ దగ్గర అక్రమ మద్యంను స్వాధీనం చేసుకున్నట్లు హైదరాబాద్​లో శనివారం ఆయన వెల్లడించారు. ఎక్సైజ్​శాఖ అధికారులు తనిఖీలు చేపట్టి అక్రమ మద్యం నివారణకు చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు చెప్పారు.

అక్రమంగా మద్యంను సరఫరా చేస్తున్న వారిపై పీడీ యాక్ట్ పెట్టనున్నట్లు ఆదేశించారు. ఎయిర్‌‌ పోర్టు రైల్వే బస్సు, పార్సల్ సర్వీసులపై నిఘా పెడుతున్నట్లు వివరించారు.