ఒలింగా నామస్మరణలతో మార్మోగిన పెద్దగట్టు

ఒలింగా నామస్మరణలతో మార్మోగిన పెద్దగట్టు

రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద జాతర, యాదవుల ఆరాధ్య దైవం పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరకు సంబంధించి మొదటి అంకమైన దిష్టి పూజా మహోత్సవం వైభవంగా జరిగింది. సాంప్రదాయం ప్రకారం దేవతామూర్తులతో కూడిన దేవరపెట్టెను కేసారం గ్రామం నుండి పెద్దగట్టుకు చేర్చి దిష్టి పూజను నిర్వహించారు పూజలు. ఈ నెల 28 నుండి మార్చి నెల 4 వ వరకు పెద్దగట్టు జాతర జరగనుంది. అయితే 15 రోజుల ముందు దిష్టి పూజా ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ.

యాదవ సంప్రదాయం ప్రకారం కేసారంలో ప్రత్యేకపూజలు చేసిన తర్వాత అందనపు సౌడమ్మ దేవతామూర్తులతో కూడిన దేవరపెట్టెను భక్తులు 9 కిలోమీటర్లు నడిచి పెద్దగట్టుకు తరలించారు. భక్తులు కేరింతలు కొడుతూ నృత్యాలు చేశారు. ఒలింగా నామస్మరణలతో పెద్దగట్టు మార్మోగిపోయింది. గుడి చుట్టూ ప్రదక్షిణ తర్వాత అనువంశిక బైకాన్ పూజారులు లింగమంతులు, చౌడమ్మ దేవాలయాలకు ఎదురుగా పసుపుతో వేసిన చంద్రపట్నంలో దేవరపెట్టెను ఉంచి దిష్టి పూజ తంతును నిర్వహించారు. ఇవాళ వచ్చే భక్తులకు ప్రసాదం ఇచ్చిన తర్వాత దేవరపెట్టెను తిరిగి కేసారం తరలించడంతో దిష్టి పూజా తంతు సంపూర్ణంగా ముగుస్తుంది. దిష్టి పూజా మహోత్సవం సందర్బంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.