స్పర్శ్ హాస్పిస్‌‌‌‌లో పీడియాట్రిక్ పాలెటివ్ కేర్ వార్డు

స్పర్శ్ హాస్పిస్‌‌‌‌లో పీడియాట్రిక్ పాలెటివ్ కేర్ వార్డు

హైదరాబాద్, వెలుగు: ఖాజాగూడాలోని స్పర్శ్ హాస్పిస్​లో శనివారం వరల్డ్ హాస్పిస్, పాలెటివ్ కేర్ డే  ప్రోగ్రామ్​ను నిర్వహించారు. చీఫ్ గెస్టులుగా హాజరైన ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, సినీ నటుడు రానా చిన్నపిల్లల కోసం 10 బెడ్స్​తో ఏర్పాటు చేసిన పీడియాట్రిక్ పాలెటివ్ కేర్ వార్డును ప్రారంభించారు. అనంతరం రానా వార్డులోని చిన్నారులతో సెల్ఫీలు దిగుతూ సరదాగా గడిపారు. స్పర్శ్​హాస్పిస్​కు రావడం సంతోషంగా ఉందన్నారు.

జయేశ్​ రంజన్ మాట్లాడుతూ..  స్పర్శ్ హాస్పిస్ ఉచితంగానే క్యాన్సర్ బాధితులకు మనోధైర్యాన్ని అందిస్తోందన్నారు. 11 ఏండ్లలో 5,500 మంది పేషెంట్లకు ఉచితంగా సేవలందించిందన్నారు. కార్యక్రమంలో రెయిన్​బో హాస్పిటల్స్ చైర్మన్, ఎండీ డాక్టర్ రమేష్ కంచర్ల, బంజారాహిల్స్ రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ ప్రభాకర్ దూలపూడి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాణి కుముదిని, రోటరీ క్లబ్ లాంగ్ టర్మ్ ట్రస్టీ జగదీశ్ తదితరులు పాల్గొన్నారు.