ఒక పీకే సరిపోడని, చంద్రబాబు మరొక పీకేను తెచ్చుకున్నాడు..!

ఒక పీకే సరిపోడని, చంద్రబాబు మరొక పీకేను తెచ్చుకున్నాడు..!

2024 ఎన్నికల్లో ఏ పార్టీ గెలవబోతుందన్న అంశంపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. పీకే వ్యాఖ్యలను ప్రతిపక్ష టీడీపీ, జనసేన కూటమి తమకు అనుకూలంగా సోషల్ మీడియాలో విస్తృతంగా సర్కులేట్ చేసుకుంటుండగా అధికార వైసీపీ పీకే వ్యాఖ్యలను తిప్పి కొడుతోంది. పీకే వ్యాఖ్యలకు కౌంటర్ గా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు  ఒక్కోక్కరుగా కౌంటర్లు ఇస్తున్నారు.

మాజీ మంత్రి పేర్ని నాని ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చాడు. ఒక పీకే వల్ల కావడం లేదని చంద్రబాబు మరొక పీకేను తెచ్చుకున్నాడని ఎద్దేవా చేశాడు. పవన్ కళ్యాణ్, చంద్రబాబుతో పాటు పీకే కూడా అబద్దాల పోటీలో ఛాంపియన్ అని అన్నాడు. రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ ఏమీ చేయలేకపోతున్నాడని, అందుకే చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ ను తెచ్చుకున్నాడని అన్నారు. బీహార్ లో ప్రశాంత్ కిషోర్ ఓడిపోబోతున్నాడని, ఏపీలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు చిత్తుగా చిత్తుగా ఓడిపోవడం ఖాయం అని అన్నారు.

సంక్షేమం మాత్రమే చేస్తే గెలవరని అంటున్న పీకే మ్యానిఫెస్టోల్లో ఎడాపెడా సంక్షేమ పథకాలు పెట్టమని చంద్రబాబుకు సలహా ఎందుకిచ్చాడని ప్రశ్నించాడు. రాష్ట్రంలో అభివృద్ధి లేకపోతే గత ఐదేళ్లుగా అన్ని రంగాల్లో ముందంజలో ఎలా ఉందని ప్రశ్నించాడు. తాను ,మహామాంత్రికుడిని అని చెప్పుకుంటున్న ప్రశాంత్ కిషోర్ సొంత రాష్ట్రంలో బిహర్లో తన పార్టీని ఎందుకు గెలిపించలేకపోయాడని అన్నారు. పీకే రాజకీయ బిచ్చగాడిగా మారిపోయాడని అన్నారు. ఇంట గెలవని వాడు రచ్చ ఎలా గెలవగలడని అన్నారు.  

Also Read: జగన్ ఓటమి ఖాయం... బాంబు పేల్చిన పీకే..!