షాకివ్వబోతున్న పెట్రోల్ బంకులు.. రూ.2 వేలకు మించి పెట్రోల్, డీజిల్ కావాలంటే డబ్బులివ్వాల్సిందే.. UPI పేమెంట్లకు నో !

షాకివ్వబోతున్న పెట్రోల్ బంకులు.. రూ.2 వేలకు మించి పెట్రోల్, డీజిల్ కావాలంటే డబ్బులివ్వాల్సిందే.. UPI పేమెంట్లకు నో !

దేశవ్యాప్తంగా మర్చంట్ డిస్కౌంట్ రేటు (MDR) గురించి చర్చ నడుస్తుంది. పెద్ద మొత్తంలో జరిగే లావాదేవీలపై పరిమితంగా ఎండీఆర్ విధించే అంశంపై ఎన్‌‌పీసీఐ కమిటీ తాజాగా నిర్ణయం తీసుకుంది. వినియోగదారుడు రూ. 2 వేల కంటే ఎక్కువ యూపీఐ పేమెంట్ చేస్తే.. ఆ వ్యాపారి నుంచి బ్యాంకులు 0.4 శాతం రుసుమును వసూలు చేస్తాయి.

ఈ క్రమంలో..  ₹2,000, అంతకంటే ఎక్కువ UPI లావాదేవీలపై ₹5 ఫ్లాట్ మర్చంట్ డిస్కౌంట్ రేటు (MDR) విధించే అవకాశం ఉండటంతో పెట్రోల్ బంకు డీలర్లు రూ.2 వేలకు మించి వినియోగదారులు చేసే యూపీఐ పేమెంట్లపై బెంబేలెత్తిపోతున్నారు.

పెట్రోల్ బంకుల్లో రూ.2 వేలకు మించి యూపీఐ పేమెంట్లను స్వీకరించకూడదనే ఆలోచన చేస్తున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా పెట్రోలియం ట్రేడర్స్ (FAIPT) ప్రతినిధి మాంటీ సెహగల్ చెప్పడం కలకలం రేపింది. ఫోర్ వీలర్ యజమానులు ఎక్కువగా రూ.2 వేలకు మించి పెట్రోల్, డీజిల్ ఫిల్ చేసి యూపీఐ పేమెంట్స్ చేస్తుంటారు.

టూవీలర్స్ యజమానుల్లో కూడా కొందరు రూ.2 వేలకు మించి యూపీఐ పేమెంట్స్ చేస్తుంటారు. ఇలాంటి వారికి.. ఇకపై రెండు వేలకు మించి ఇంధనం కావాలంటే లిక్విడ్ క్యాష్ ఇవ్వాలని పెట్రోల్ బంకుల్లో స్వీయ షరతులు విధించుకునే అవకాశాలు లేకపోలేదు. డిజిటల్ చెల్లింపులపై అదనపు ఖర్చులను భరించేందుకు సిద్ధంగా లేని పెట్రోల్ బంకు యాజమాన్యాలు.. లిక్విడ్ క్యాష్ పేమెంట్లను ప్రోత్సహించాలని భావిస్తున్నాయి.

దేశంలో చిరువ్యాపారి మొదలు బడా మాల్స్ వరకు నగదు రహిత చెల్లింపుల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫేస్ (యూపీఐ) వ్యవస్థలో కీలక మార్పు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. గడిచిన ఆరేళ్లుగా సాగిన పూర్తి ఉచిత సేవలకు తెరదించుతూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది.

►ALSO READ | టర్నోవర్ కాదు.. మా మార్జిన్లను చూడండి: UPI ఛార్జీలపై మోడీకి BJP లీడర్ లేఖ

పెద్ద మొత్తంలో జరిగే వ్యాపార లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) రుసుమును విధిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మంగళవారం  నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేమెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండియా (ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీసీఐ) చార్జీలను ఖరారు చేసింది. రూ.2 వేలకు మించి వ్యాపారులకు వ్యక్తులు చేసే చెల్లింపులపై 0.4 శాతం (రూ.8) ఎండీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చార్జీ వర్తిస్తుందని స్పష్టం చేసింది.

అక్టోబర్‌‌ 15 నుంచి ఈ చార్జీలు అమల్లోకి వస్తాయని ప్రకటించింది. సాధారణ వినియోగదారులకు ఊరట కల్పించింది. ఎప్పటిలాగే పర్సన్ టు పర్సన్‌‌ (పీ2పీ) యూపీఐ లావాదేవీలను ఉచితంగానే కొనసాగించవచ్చని పేర్కొన్నది. అలాగే, పీ2పీతోపాటు రూ.2వేలలోపు వ్యాపార చెల్లింపులు (పీ టు ఎం) ఎండీఆర్‌‌ పరిధిలోకి రావని స్పష్టం చేసింది.