ప్రతి 4 రోజులకు పెట్రోల్, డీజిల్ ధరల పెంపు: 15, 19, 23.. తర్వాత 27న పెంచుతారా..?

ప్రతి 4 రోజులకు పెట్రోల్, డీజిల్ ధరల పెంపు: 15, 19, 23.. తర్వాత 27న పెంచుతారా..?

పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. 2026, మే 23వ తేదీ పెట్రోల్పై 87 పైసలు, డీజిల్ పై కేంద్ర ప్రభుత్వం 91 పైసలు పెంచింది. ఇంత వరకు బాగానే ఉన్నా.. 10 రోజుల్లో ధరలు పెంచటం ఇది మూడోసారి. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు విషయంలో ఆయిల్ కంపెనీలు ఓ ప్యాట్రన్ ఫాలో అవుతున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తుంది. అదేంటో చూద్దాం..

* ఫస్ట్ టైం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచింది: మే 15వ తేదీ 
* రెండో సారి ఇంధన ధరలు పెంచింది: మే 19వ తేదీ
* మూడో సారి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచింది: మే 23వ తేదీ..

పైన డేటాను పరిశీలిస్తే నాలుగు రోజులకు ఒకసారి పెంచటం జరిగింది. 15వ తేదీ తర్వాత 19.. ఆ తర్వాత 23వ తేదీ.. అంటే ధరల పెంపు మధ్య 4 రోజుల గ్యాప్ ఉండేలా చూసుకుంటున్నారు.

ఇదే సమయంలో మరో ఆసక్తికరమైన అంశంపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. గతంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపును రాత్రి టైంలో అనౌన్స్ చేసేవాళ్లు.. రేపటి ఉదయం పత్రికల్లో ఆ వార్త వచ్చేసింది. ఇప్పుడు ఈ విధానం మారింది.

►ALSO READ | జూన్ 5లోగా ఢిల్లీ జింఖానా క్లబ్ ను రక్షణశాఖకు అప్పగించాలి: కేంద్రం 

అర్థరాత్రి తర్వాత.. తెల్లవారుజామున ధరల పెంపు ప్రకటన చేస్తున్నారు. ఉదయం ఆరు గంటల సమయంలోనే ఈ వార్త జనానికి తెలుస్తుంది. పెంచిన ధరలు ఈ ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చాయని ప్రకటిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ రేట్లు పెంపు అనేది టీవీల్లో, సోషల్ మీడియాలో చూసి మాత్రమే జనం తెలుసుకుంటున్నారు.

ధరల పెంపు డేటా పరిశీలిస్తే.. రాబోయే నాలుగు రోజులకు అంటే.. 27వ తేదీన మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ఉండొచ్చని నెటిజన్లు అంటున్నారు. ఇప్పటికే ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్పై లీటర్కు 30 రూపాయల వరకూ నష్టాన్ని భరిస్తున్నాయి. ఇప్పటి వరకు పెంచింది అటూ ఇటుగా 5 రూపాయలు మాత్రమే. అంటే ధరలు పెంచాల్సింది ఇంకా చాలా ఉంది.

ఒకేసారి భారీగా పెంచితే తీవ్ర వ్యతిరేకత వస్తుందనే భయంతో.. నాలుగు రోజులకు ఒకసారి.. 90 పైసలు, 95 పైసలు.. రూపాయి అంటూ కొద్ది కొద్దిగా పెంచుకుంటూ పోతారనే టాక్ నడుస్తుంది. 15 అయిపోయింది.. 19 అయిపోయింది.. 23 అయిపోయింది... ఇక 27వ తేదీకి వెయిటింగ్.. ఎంత ధర పెంచుతారోనని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.