జూన్ 5లోగా ఢిల్లీ జింఖానా క్లబ్ ను రక్షణశాఖకు అప్పగించాలి: కేంద్రం 

జూన్ 5లోగా ఢిల్లీ జింఖానా క్లబ్ ను రక్షణశాఖకు అప్పగించాలి: కేంద్రం 

దేశంలోనే అతి పురాతన క్లబ్‌లలో ఒకటైన లూటియన్స్ ఢిల్లీలోని జింఖానా క్లబ్‌ను జూన్ 5 లోగా ప్రాంగణాన్ని సర్కార్ కు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. రక్షణ మౌలిక సదుపాయాలు బలోపేతం చేసేందుకు, ప్రజా భద్రతాప్రయోజనాల కోసం ఇంపీరియల్ ఢిల్లీ జింఖానా క్లబ్ లిమిటెడ్‌ ఆధీనంలో ఉన్న 27.3 ఎకరాల స్థలాన్ని రక్షణ శాఖకు అప్పగించాలని ఆదేశించింది. 

ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ రోడ్‌లో ఉన్న ప్రాంగణాన్ని గతంలో సామాజిక ,క్రీడా క్లబ్‌ను నిర్వహించే నిర్దిష్ట ప్రయోజనం కోసం ఇంపీరియల్ ఢిల్లీ జింఖానా క్లబ్ లిమిటెడ్‌కు లీజుకు ఇచ్చినట్లు మే 22న జారీ చేసిన అధికారిక ఉత్తర్వులో పేర్కొంది. 

ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం.. జూన్ 5న ఆ ప్రాంగణాన్ని భూమి ,కార్యాలయ బవనాన్ని స్వాధీనం చేసుకోనుంది. ప్రభుత్వం తరపున ఆ శాఖ సాంకేతిక విభాగం స్వాధీనం చేసుకుంటుందని తెలిపింది. 

►ALSO READ | భేల్ పూరి ప్యాకింగ్ కు బ్యాంకు స్టేట్ మెంట్ పేపర్లు..డేటా ప్రైవసీపై నెటిజన్లు ఫైర్

1913లో ఢిల్లీ జింఖానా క్లబ్ ప్రారంభమైంది. లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని ప్రధానమంత్రి నివాసానికి ఆనుకొని, లూటియన్స్ ఢిల్లీ నడిబొడ్డున ఉంది. అప్పట్లో దీనిని  ఇంపీరియల్ ఢిల్లీ జింఖానా క్లబ్ అని పిలిచేవారు. 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత  ఇంపీరియల్ అనే పదాన్ని తొలగించారు.