V6 News

ఈడీకి ఎలాంటి మెయిల్ పంపలేదు : పైలెట్ రోహిత్ రెడ్డి

ఈడీకి ఎలాంటి మెయిల్ పంపలేదు : పైలెట్ రోహిత్ రెడ్డి

ఈడీ విచారణకు హాజరుపై పైలెట్ రోహిత్ రెడ్డి స్పందించారు. విచారణకు హాజరయ్యే విషయంలో ఈడీకి తాను ఎలాంటి మెయిల్ పంపలేదని స్పష్టం చేశారు. ఫాం హౌస్ కేసులో మనీలాండరింగ్ జరగలేదని, అయినా ఈడీ ఇన్వాల్వ్ కావడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశానని, రేపు అది బెంచ్ పైకి వస్తుందని చెప్పారు. హైకోర్టు ఆదేశాల మేరకు ముందుకెళ్తానని అన్నారు. ఈడీ విచారణకు వెళ్లడంపై న్యాయవాదులతో చర్చించి వారు చెప్పినట్లు చేస్తానని అన్నారు. 

ఫాం హౌస్ కేసులో రోహిత్ రెడ్డి ఇవాళ ఈడీ విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే ఆయన ఇప్పటి వరకు ఈడీ ఆఫీసుకు వెళ్లలేదు. ఉదయం ఎంక్వైరీకి రాలేనని రోహిత్ రెడ్డి ఈడీకి ఈ మెయిల్ పంపినట్లు వార్తలు వచ్చినా వాటిని ఖండించిన రోహిత్ రెడ్డి.. సీఎం క్యాంప్ ఆఫీసుకు బయలుదేరి వెళ్లారు.