Women Special : మిలమిలా మెరిసే అందానికి ఓట్స్

Women Special : మిలమిలా మెరిసే అందానికి ఓట్స్

ఓట్స్ తో తయారు చేసిన ప్యాక్, స్క్రబ్ ముఖానికి వేసుకుంటే మొటిమలు, మచ్చలు పోతాయి. ట్యాన్, డార్క్ సర్కిల్స్ మాయం అవుతాయి. ఇవే కాదు ఇంకా బోలెడు లాభాలున్నాయి. అవేంటంటే.. 

• ఒకకప్పు ఓట్స్ ని పొడి చేసి బకెట్ వేడినీళ్లలో కలపాలి. వాటిల్లో ఒక టీ స్పూన్ రోజ్ వాటర్ కూడా వేయాలి. ఇరవై నిమిషాల తర్వాత ఆ నీళ్లతో స్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే ఓట్స్ లోని మాయిశ్చరైజింగ్, క్లెన్సింగ్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీలు దుమ్ము, ధూళి వల్ల డ్యామేజ్ అయిన స్కిన్ ని రిపేర్ చేస్తాయి.

• ఒక టేబుల్ స్పూన్ పెరుగులో, ఒక టేబుల్ స్పూన్ ఓట్స్ పొడి, కొద్దిగా తేనె కలిపి ముఖానికి మసాజ్ చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చర్మంపై బ్లాకాడ్స్ పూర్తిగా పోతాయి. చర్మం మెరుస్తుంది కూడా. 

• ఎగ్ వైట్ లో రెండు టీ స్పూన్ల నిమ్మరసం, ఒక టేబుల్ స్పూన్ ఓట్స్ పొడి వేసి పేస్ట్గా చేసి ముఖానికి ప్యాక్ వేసుకున్నా రిజల్ట్ బాగుంటుంది. అలాగే ఒక టేబుల్ స్పూన్ ఓట్స్ పొడిలో కొద్దిగా టొమాటో జ్యూస్ , రెండు టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్ కలిపి పేస్ట్ చేసి ప్యాక్ వేసుకుంటే చర్మం ఫ్రెష్ గా ఉంటుంది.