ఆమ్దానీపై కంటోన్మెంట్ బోర్డు ఫోకస్

ఆమ్దానీపై కంటోన్మెంట్ బోర్డు ఫోకస్
  • ఏరియాను బట్టి రూ.50 -100 కలెక్ట్ చేయాలని నిర్ణయం

కంటోన్మెంట్, వెలుగు: నిధులు లేక  సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఆదాయ మార్గాలపై ఫోకస్ ​పెట్టింది. ఇటీవల జరిగిన బోర్డు మీటింగ్​లో ఇంటింటి నుంచి చెత్త సేకరణ చార్జీ వసూలు చేయాలని నిర్ణయించింది. బోర్డు పరిధిలోని కాలనీల్లో ఇంటికి రూ.100, బస్తీలలో అయితే రూ.50 కలెక్ట్ చేసేందుకు ఆఫీసర్లు రెడీ అయ్యారు. చెత్త సేకరణ బాధ్యతను ప్రైవేటు కాంట్రాక్టర్​కు అప్పగించారు. ఇక నుంచి రోడ్లపై చెత్త పారబోయడం, పేరుకుపోవడం ఉండవని చెబుతున్నారు. గార్బేజ్​చార్జీలతో  బోర్డుకు నెలకు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఆదాయం సమకూరుతుందని అంటున్నారు. 
 

390 కాలనీలు.. 40 బస్తీలు
కంటోన్మెంట్​బోర్డు పరిధిలో దాదాపు 390 రెసిడెన్షియల్ కాలనీలు, 40 బస్తీలు ఉన్నాయి. వాటిలో 4 లక్షల మంది ఉంటున్నారు. డైలీ 200 మెట్రిక్ టన్నుల చెత్త వస్తుంటుంది. మొన్నటి వరకు జీహెచ్ఎంసీ పరిధిలో సేకరించినట్లే ప్రతి ఇంటి ముందుకు చెత్త ఆటో వెళ్లేది. చెత్త సేకరించే ప్రైవేట్​సిబ్బంది రానప్పుడు ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయేది. చెత్త సేకరించే ప్రైవేటు సిబ్బందే ప్రతి ఇంటి నుంచి నెలకు రూ.100 నుంచి రూ.200 తీసుకునేవారు. కాగా దేశవ్యాప్తంగా ఉన్న కంటోన్మెంట్​బోర్డులలో చెత్త సేకరణ, శానిటేషన్​బాధ్యతలను ప్రైవేట్​కాంట్రాక్టర్లకు అప్పగించారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్​లోనూ అదే విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. కొత్త విధానంతో ఇప్పటివరకు కొనసాగుతున్న ప్రైవేటు సిబ్బంది ఉపాధి కోల్పోతామని ఇటీవల ఆందోళనకు దిగారు. సొంత ఆటోలు సమకూర్చుకున్న వారికి చెత్తసేకరణ బాధ్యతలు అప్పగిస్తామని ఆఫీసర్లు హామీ ఇవ్వడంతో సమస్య సద్దుమణిగింది. తాజా నిర్ణయం ప్రకారం బోర్డు ఆఫీసర్లే గార్బేజ్​చార్జీ కలెక్ట్​చేయనున్నారు. ఇప్పటికే ఈ విధానాన్ని బోర్డు పరిధిలోని బోయిన్​పల్లి సర్కిల్​లో పైలెట్ ప్రాజెక్టుగా ఇంప్లిమెంట్ చేశారు. సక్సెస్​అవ్వడంతో మిగిలిన నాలుగు సర్కిళ్లలోనూ అమలు చేసేందుకు రెడీ అయ్యారు. మొదట కాలనీలలోని ఇంటి నుంచి రూ.150, బస్తీల్లోని ఇంటి నుంచి రూ.100 వసూలు చేయాలని ఆఫీసర్లు నిర్ణయించగా బోర్డు నామినేటెట్ సభ్యుడు రామకృష్ణ వ్యతిరేకించారు. చార్జీల్లో మార్పులు చేయాలని కోరారు. స్పందించిన ఆఫీసర్లు కాలనీల్లో రూ.100, బస్తీలకు రూ.50గా 
నిర్ణయించారు. 

ఇక్కడ బెల్లమే బంగారం
మహాముత్తారం, వెలుగు: మేడారంలో బెల్లమే మహా ప్రసాదం. అమ్మవార్లకు బెల్లాన్నే నైవేద్యంగా పెడతారు. గద్దెల వద్ద ఒడి బియ్యం, చీరె, సారె, పసుపు, కుంకుమ, గాజులతోపాటు తప్పకుండా బెల్లం సమర్పించుకుంటారు. కానీ బెల్లాన్ని ‘బంగారం’ అని పిలవడం ఇక్కడి ప్రత్యేకత. ఇలా పిలవడానికి కొన్ని కారణాలను గిరిజన పెద్దలు చెబుతారు. ఆదివాసీలకు బెల్లం, ఉప్పు అంటే ఎంతో ఇష్టం. ఎందుకంటే అడవుల్లో అనేకం దొరికినా ఈ రెండు మాత్రం వేరే ప్రాంతాల నుంచి రావాల్సిందే. అందుకే గిరిజనులు వీటికి ఎక్కువ విలువ ఇస్తారు. ఈ క్రమంలోనే చాలా మంది మహిళలు తమకు సంతానం కలిగినా, ఇతరత్రా కోర్కెలు నెరవేరినా తమకు బంగారం అంతటి విలువైన బెల్లాన్ని నిలువెత్తు సమర్పిస్తామని మొక్కుకుంటారు. సమ్మక్క భర్త పేరు పగిడిద్ద రాజు. ఈ పేరులో ‘పగిడి’ అంటే బంగారం అనే అర్థం వాడుకలో ఉంది. అందుకే అమ్మవారికి ‘బంగారం’ సమర్పించడం అంటే పగిడిద్ద రాజును ఆమె చెంతకు చేర్చినట్లేనని భావిస్తారు. ఇక తరుచూ రక్తహీనతతో బాధపడే గిరిజనులకు బెల్లం ఒక టానిక్​లా పనిచేసేది. పంచిపెట్టుకునే బంగారాన్ని నెలల తరబడి ఇండ్లలో ఉంచుకొని తినడం వల్ల హెల్త్​కు మేలు జరిగేది. అందువల్లే ఈ ఆచారం నాటి నుంచి నేటి వరకు కొనసాగుతూ వస్తోంది.