అరాఘ్చీతో మోదీ భేటీ..రష్యా విదేశాంగ మంత్రితోనూ సమావేశం

అరాఘ్చీతో మోదీ భేటీ..రష్యా విదేశాంగ మంత్రితోనూ సమావేశం

న్యూఢిల్లీ: ఇరాన్, రష్యా విదేశాంగ మంత్రులు అబ్బాస్  అరాఘ్చీ, సెర్గీ లవ్ రోవ్​తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. బ్రిక్స్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం గురువారం ఢిల్లీలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆ ఇద్దరు విదేశాంగ మంత్రులతో మోదీ సమావేశమయ్యారు. పశ్చిమాసియాలో యుద్ధంతో పాటు పలు అంతర్జాతీయ అంశాలపై వారు చర్చించారు.

అనంతరం విదేశాంగ మంత్రులను ఉద్దేశిస్తూ అరాఘ్చీ మాట్లాడారు. ఈ సందర్భంగా అమెరికా తీరును ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రపంచ దేశాలపై యూఎస్  ఒత్తిడి పెరిగిందని, ఇతర దేశాల వ్యవహారాల్లో అనవసరంగా జోక్యం చేసుకుంటున్నదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా ఒత్తిడికి ఇరాన్  ప్రతిఘటించడం ఈ సమావేశంలో పాల్గొన్న దేశాలకు కొత్త కాదన్నారు. కాగా.. శుక్రవారం కూడా బ్రిక్స్  దేశాల విదేశాంగ మంత్రుల భేటీ జరగనుంది.