రాముడికి ప్రాణ ప్రతిష్ఠ : రామ రాజ్యం వచ్చేసిందీ

రాముడికి ప్రాణ ప్రతిష్ఠ : రామ రాజ్యం వచ్చేసిందీ

అయోధ్య రాముడికి ప్రాణ ప్రతిష్ఠ జరిగింది.. ముహూర్తం ప్రకారం జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు.. 84 సెకన్లపాటు.. శాస్త్రోక్తంగా.. ఆచారం ప్రకారం బాల రాముడికి ప్రాణం పోశారు పూజారులు. ఈ మహా ఘట్టంతో.. అయోధ్య రాముడు అందరివాడు అయ్యాడు. భక్తుల కోరికలు తీర్చే దేవుడిగా.. ధర్మాన్ని నాలుగు పాదాలపై నడిపించే యుగ పురుషుడిగా.. భక్త కోటి నుంచి నిత్యం పూజలు అందుకోనున్నారు.

ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రధాని మోదీ స్వయంగా పాల్గొన్నారు. పూజలు చేశారు. రామ పారాయణం చేశారు. అయోధ్య ఆలయంలోని గర్భ గుడిలో జరిగిన ఈ వేడుకలో.. మోదీతోపాటు యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్, యూపీ గవర్నర్ ఆనంది బెన్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తోపాటు పూజారులు మాత్రమే ఉన్నారు. మోదీతో పూజలు చేయించటం విశేషం. 

అయోధ్య బాల రాముడికి ప్రాణ ప్రతిష్ఠతో రామ రాజ్యం వచ్చేసింది. 5 వందల సంవత్సరాల తర్వాత.. అయోధ్యలో.. తాను పుట్టిన స్థలంలో సగర్వంగా రాముడు కొలువదీరాడు. అయోధ్య నుంచి అఖండ భారతానికి రామ రాజ్యం తీసుకొచ్చారు. ప్రతి హిందూవు గర్వించే రోజుగా బీజేపీ అభివర్ణిస్తుంది. అయోధ్యలో బాల రాముడికి ప్రాణ ప్రతిష్ఠతో.. 500 ఏళ్ల తర్వాత.. తిరిగి అయోధ్యలో కొలువు దీరటం అద్భుతమైన ఘట్టంగానే చెప్పాలి. 

మోఘల్ వంశానికి చెందిన బాబర్.. రాముడి జన్మ స్థలాన్ని కూల్చేసి.. అక్కడ బాబ్రీ మసీదు నిర్మించాడని వివాదం 500 ఏళ్లుగా ఉంది. అప్పటి నుంచి హిందూ సంఘాలు, రాజకీయ పార్టీలు.. తిరిగి రామ జన్మభూమిని దక్కించుకోవటం ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేశాయి. కోర్టుల ద్వారా శాశ్వత పరిష్కారం లభించటంతో.. అయోధ్యలో.. తాను పుట్టిన స్థలంలోనే రాముడికి ప్రాణ ప్రతిష్ఠ జరగటం ద్వారా పూర్వ వైభవం వచ్చింది.