బద్దం బాల్ రెడ్డి గొప్ప నేత: స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి

బద్దం బాల్ రెడ్డి గొప్ప నేత: స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి

బీజేపీ సీనియర్ నేత బద్దం బాల్ రెడ్డికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు పలువరు నేతలు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి ఛైర్మన్ స్వామిగౌడ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, జానారెడ్డి, నాగం జనార్ధన్ రెడ్డి .. బాల్ రెడ్డి భౌతికకాయాన్ని సందర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. బాల్ రెడ్డి లాంటి గొప్ప నేతను కోల్పోవడం బాధాకరమన్నారు పోచారం. ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.

మధ్యాహ్నం బాల్ రెడ్డి భౌతికకాయాన్ని నాంపల్లిలోని పార్టీ ఆఫీస్ కు తరలించనున్నారు. అక్కడ పార్టీ కార్యకర్తల సందర్శనార్థం మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంచనున్నారు. ఆ తర్వాత అంతిమయాత్ర కొనసాగనుంది. సాయంతరం మహాప్రస్థానం అంత్యక్రియలు పూర్తి కానున్నాయి.