హైదరాబాద్, వెలుగు: అంతర్రాష్ట్ర నదీ జలాల ఒప్పందం, గోదావరి వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ అవార్డుల ప్రకారం పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తున్నామని పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) తెలిపింది. అయితే, ప్రాజెక్టు ఫలాలను త్వరగా అందించాలన్న ఉద్దేశంతో తొలి దశలో 41.15 మీటర్ల ఎత్తుతో ప్రాజెక్టును పూర్తి చేస్తామని స్పష్టం చేసింది. పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌తో తెలంగాణలో ముంపు ప్రభావంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ నెల 4న పీపీఏకి హరీశ్ లేఖ రాశారు.
ఆ లేఖకు తాజాగా పీపీఏ మెంబర్ సెక్రటరీ ఎం.రఘురాం రిప్లయ్ ఇచ్చారు. 2025 ఏప్రిల్ 8న నిర్వహించిన మీటింగ్‌లో తెలంగాణ ప్రభుత్వం ముంపుపై అభ్యంతరాలు తెలిపిందని, ఆయా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. . పోలవరం ప్రాజెక్టుతో ముంపునకు గురయ్యే గ్రామాల సమస్యలను పరిష్కరిస్తామన్నారు.
