ఎమ్మెల్యే రఘునందన్పై మరో ఫిర్యాదు..

ఎమ్మెల్యే రఘునందన్పై మరో ఫిర్యాదు..

బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై తెలంగాణ ఉమెన్ అండ్ ట్రాన్స్ జెండార్ ఆర్గనైజేషన్స్ జాయింట్ యాక్షన్ కమిటీ అబిడ్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. మైనర్ బాలిక వీడియోలను మీడియా ముందు బహిర్గతం చేసిన ఎమ్మెల్యేపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.ఎమ్మెల్యే రఘునందన్ రావుపై సెక్షన్ 23 POCSO 2012 యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని పీవోడబ్ల్యూ సంధ్య పోలీసులను కోరారు. ఇటీవల హైదరాబాద్ లో మైనర్ బాలికపై జరిగిన ఘటన అంశానికి సంబంధించిన వీడియోలు,ఫొటోలను ఎమ్మెల్యే రఘునందన్ రావు విడుదల చేసిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో నిందితురాలి వివరాలను బయటపెట్టారనే ఆరోపణలతో ఆయనపై అబిడ్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.