జూబ్లీహిల్స్లోని ఆరు పబ్బులపై కేసు

జూబ్లీహిల్స్లోని ఆరు పబ్బులపై కేసు

జూబ్లీహిల్స్ లోని ఆరు పబ్బుల పై కేసు నమోదు చేశారు పోలీసులు. నిబంధనలు పాటించని ఆరు పబ్ ల పై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.  హలో, టార్, గ్రీన్ మంకిస్, మకవ్, లాఫ్ట్, జీనా పబ్బులపై కేసు నమోదు చేశారు. న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ లో నిర్ణీత సమయం దాటి పబ్బులు నడిపినందుకు.. అధిక  సౌండ్ తో స్థానికులు ఇబ్బంది పెట్టినందుకు కేసు నమోదు చేశారు పోలీసులు.

హైదాబాద్ లో డిసెంబర్ 31 రాత్రి ఒంటింగంట వరకు మాత్రమే న్యూ ఇయర్ వేడుకలను జరుపుకోవాలని.. పబ్బులను మూసివేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన పబ్బులపై  కేసు నమోదు చేస్తామని ముందే హెచ్చరించారు. అయినా కొన్ని పబ్బులు సమయం దాటిన పబ్బులు క్లోజ్ చేయకుండా ..ఎక్కువ సౌండ్ పెట్టి నిబంధనలను ఉల్లంఘించారు.