ముంబై రోడ్డుపై ఫ్రాన్స్ ప్రెసిడెంట్ పోస్టర్లు

ముంబై రోడ్డుపై ఫ్రాన్స్  ప్రెసిడెంట్ పోస్టర్లు

ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ పోస్టర్లను ముంబైలో రోడ్డుపై అంటించారు. ఆ పోస్టర్ల పైనుంచి వెహికల్స్, జనం వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. గురువారం సాయంత్రం సౌత్ ముంబై భేండి బజార్ లోని జేజే ఫ్లై ఓవర్ కింద మహమ్మద్ అలీ రోడ్డుపై ఇమ్మాన్యుయెల్ పోస్టర్లను అంటించారని పోలీసులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే వాటిని తొలగించామని చెప్పారు. ఈ సంఘటనపై ఇప్పటి వరకు ఎలాంటి కేసు నమోదు చేయలేదన్నారు. ఫ్రాన్స్ లో చెలరేగిన కార్టూన్ వివాదం విషయంలో ముస్లిం దేశాల నుంచి ఇమ్మాన్యుయెల్ విమర్శలు ఎదుర్కొంటున్నారు.