సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పోలీసుల తనిఖీలు

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పోలీసుల తనిఖీలు

ఆజాది కా అమృత్ మహోత్సవాలు, ఆగస్టు 15 సందర్భంగా జీఆర్పీ పోలీసులు, ఆర్పీఎఫ్ పోలీసులు సంయుక్తంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో తనిఖీలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా స్టేషన్ అన్ని ప్లాట్ పామ్స్ తోపాటు బయటి పరిసరాలను తనిఖీలు చేశారు. రైల్వేస్టేషన్ లోని ప్రయాణికుల బ్యాగులు, సూటుకేసులతో పాటు వారి వద్ద ఉన్న అన్ని లగేజీలను డాగ్ స్వ్కాడ్ తో తనిఖీలు చేశారు.

అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపించినా వెంటనే తమకు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు. పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్ 100, జీఆర్పీ హెల్ప్ లైన్1512, రైల్వే, ఆర్పీఎఫ్ హెల్ప్ లైన్139 తోపాటు జీఆర్పీ ఎస్ బి కంట్రోల్ రూమ్ నంబర్ 9440700040 లేదా 040 27702337 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని ప్రయాణికులకు పోలీసులు విజ్ఞప్తి చేశారు.