Fire accident : డ్రోన్ సాయంతో పోలీసుల సెర్చ్ ఆపరేషన్

Fire accident : డ్రోన్ సాయంతో పోలీసుల సెర్చ్ ఆపరేషన్

డెక్కన్ స్పోర్ట్స్ స్టోర్స్లో అగ్ని ప్రమాదం అనంతరం పరిస్థితిని అధికారులు సమీక్షిస్తున్నారు. పొగ, వేడి కారణంగా లోపలికి వెళ్లి పరిశీలించడం కష్టంగా మారడంతో పోలీసులు డ్రోన్ సాయం తీసుకుంటున్నారు. దాన్ని ఉపయోగించి భవనం లోపల పరిస్థితితో పాటు బిల్డింగ్ స్ట్రక్చర్ ఎలా ఉందన్నది పరిశీలిస్తున్నారు. సెకండ్ ఫ్లోర్లో ఒక డెడ్ బాడీ ఆనవాళ్లు ఉన్నట్లు ఫైర్ సిబ్బంది చెప్పడంతో డ్రోన్ సాయంతో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు సెంట్రల్ జోన్ డీసీపీ రాజేష్ చంద్ర చెప్పారు. 

సెల్లార్ నుంచి మంటలు ప్రారంభమైనట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. అయితే మంటలు ఎలా అంటుకున్నాయన్నది మాత్రం ఇప్పటికి తెలియలేదని చెప్పారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. మరోవైపు ఫోరెన్సిక్ టీం సైతం క్లూస్ సేకరించే పనిలో పడింది.