కులగణనకు అడ్డుపడేవారికి రాజకీయ సమాధే: జాజుల శ్రీనివాస్ గౌడ్

కులగణనకు అడ్డుపడేవారికి  రాజకీయ సమాధే: జాజుల శ్రీనివాస్ గౌడ్

ఖైరతాబాద్, వెలుగు : కులగణనను వ్యతిరేకించే పార్టీలకు రాజకీయ సమాధి తప్పదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్​ గౌడ్​  అన్నారు. బీసీ సంక్షేమ సంఘం, బీసీ కుల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం ప్రెస్​క్లబ్​లో  సమావేశం  నిర్వహించారు. ఈనెల 6  నుంచి 20 వరకు అలంపూర్​ ​నుంచి ఆదిలాబాద్​ వరకు నిర్వహించనున్న  ‘కులగణన చైతన్య సదస్సు’ పోస్టర్​ను  ఆవిష్కరించారు. 

అనంతరం జాజుల మాట్లాడారు. ‘ఓ బీసీ! మేలుకో.. నీ కులం చెప్పుకో’ అంటూ 33 జిల్లాల్లో చైతన్య  సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. ఇందులో భాగస్వామ్యంకాని పార్టీలను బీసీ ద్రోహులుగా ప్రకటించి, రాజకీయ సమాధి చేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలు 48 గంటలలోపు కులగణనపై వారి వైఖరి చెప్పాలని డిమాండ్​  చేశారు. కులగణనపై సచివాలయంలో  ప్రత్యేకంగా టోల్​ఫ్రీ నంబరు పెట్టాలని సూచించారు.