గతంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన పూజాహెగ్డేకు గత కొంతకాలంగా తెలుగులో అవకాశాలు తగ్గాయి. మరోవైపు హిందీలోనూ పరాజయాలు పలకరిస్తున్నాయి. ప్రస్తుతం దుల్కర్‌కు జంటగా నటిస్తున్న ‘శ్రీ శ్రీ’ మినహా తెలుగులో ఆమెకు సినిమాలు లేవు. ఈ క్రమంలో బ్యాక్ టు బ్యాక్ రెండు అవకాశాలు ఆమెను వరించినట్టు తెలుస్తోంది. అందులో ఒకటి అల్లు అర్జున్ సినిమా కావడం విశేషం.
ప్రస్తుతం అట్లీ తీస్తున్న ‘రాకా’లో నటిస్తున్న అల్లు అర్జున్ ఆ తర్వాత లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్‌లో నటించబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్‌గా పూజాహెగ్డేను పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే బన్నీతో ‘అల వైకుంఠపురములో..’ లాంటి బ్లాక్ బస్టర్‌తో పాటు అంతకంటే ముందు ‘డీజే: దువ్వాడం జగన్నాథం’లోనూ పూజా హెగ్డే నటించింది.
ఇక లోకేష్ కనగరాజ్ ‘కూలీ’లో ఆమె చేసిన స్పెషల్ సాంగ్ ఎంతగా పాపులర్ అయిందో తెలిసిందే. ఈ క్రమంలో హిట్ కాంబో రిపీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు రవితేజ, శ్రీ విష్ణు హీరోలుగా హసిత్ గోలి తెరకెక్కించినున్న మల్టీస్టారర్‌లోనూ ఓ హీరోయిన్‌గా పూజాహెగ్డే పేరు వినిపిస్తోంది. ఇక గురువారం విజయ్ ‘జన నాయకుడు’ చిత్రంతో ఆమె ప్రేక్షకుల
ముందుకొస్తోంది.
