12 ఏళ్ల బంధానికి గుడ్ బై చెప్పిన షకీరా, గెరార్డ్ పిక్ 

12 ఏళ్ల బంధానికి గుడ్ బై చెప్పిన షకీరా, గెరార్డ్ పిక్ 

మాడ్రిడ్ : కొలంబియన్ సూపర్ స్టార్, పాప్ సింగర్ షకీరా, బార్సిలోనా ఫుట్ బాల్ ప్లేయర్ డిఫెండర్ గెరార్డ్ పిక్ తమ 12 ఏళ్ల బంధానికి ముగింపు పలికారు. ‘మేం విడిపోతున్నామని చెప్పడానికి చింతిస్తున్నాం. మా పిల్లల కోసం మా వ్యక్తిగత గోప్యతను గౌరవిస్తామని ఆశిస్తున్నాం’ అని షకీరా, గెరార్డ్ పేర్కొన్నారు. షకీరా, గెరార్డ్ పిక్ దంపతులకు సాషా (7 ఏళ్ళు), మిలన్ (9 ఏళ్ళు) ఇద్దరు పిల్లలు ఉన్నారు.


   
షకీరా వయసు 45 ఏళ్ళు. గెరార్డ్ వయసు 35 ఏళ్ళు. వీళ్ళిద్దరూ సౌత్ ఆఫ్రికాలో జరిగిన 2010 ఫుట్‌బాల్‌ వరల్డ్ కప్‌కు కొన్ని రోజుల ముందు కలిశారు. ఆ తర్వాత  2011లో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ వరల్డ్ కప్ కోసం షకీరా రూపొందించిన 'వాకా వాకా' సాంగ్ చాలా పాపులర్ అయ్యింది. 35 ఏళ్ల పిక్ 2010 ప్రపంచ కప్, 2012 యూరోపియన్ ఛాంపియన్‌షిప్‌లను గెలుచుకున్నాడు. బార్సిలోనాతో మూడుసార్లు ఛాంపియన్స్ లీగ్ విజేతగా నిలిచాడు.

ఇటీవల ఓ మహిళతో గెరార్డ్ ఉండగా షకీరా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారని స్పెయిన్ మీడియాలో వార్తలు వచ్చాయి. లేట్ నైట్ వరకూ గెరార్డ్ పార్టీలు చేసుకుంటూ, ఇతర మహిళలతో చనువుగా ఉంటున్నారని పేర్కొన్నాయి. ఈ వార్తలు వచ్చిన తర్వాత విడిపోతున్నట్టు ప్రకటించారు షకీరా. 

మరిన్ని వార్తల కోసం..

కాంగ్రెస్ కు షాక్ ఇచ్చిన మాజీ మంత్రులు

83 ఏళ్ల వ‌య‌సులో ఒంటరిగా సముద్ర ప్రయాణం

మరిన్ని వార్తలు