డిప్యూటీ సీఎం ఫోన్ నుంచి షేర్ అయిన పోర్న్ క్లిప్

డిప్యూటీ సీఎం ఫోన్ నుంచి షేర్ అయిన పోర్న్ క్లిప్

ఎవరో మామూలు వ్యక్తులు పోర్న్ క్లిప్ షేర్ చేస్తేనే జనాలు ఆగ్రహంతో ఊగిపోతారు. అటువంటిది ఏకంగా డిప్యూటీ సీఎం ఫోన్ నుంచే పోర్న్ క్లిప్ షేర్ అయితే? పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించలేం. తాజాగా అటువంటి ఘటనే గోవాలో జరిగింది. గోవా డిప్యూటీ సీఎం చంద్రకాంత్ కవేల్కర్ ఫోన్ నుంచి సోమవారం తెల్లవారుజామున ఆయన మెంబర్‌గా ఉన్న ఒక వాట్సాప్ గ్రూప్‌కు ఒక పోర్న్ క్లిప్ ఫార్వర్డ్ చేయబడింది. దాంతో గోవాలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ ఘటనపై కవేల్కర్ గోవా పోలీస్ సైబర్ సెల్‌కు ఫిర్యాదు చేశారు.

‘నా ఫోన్‌ను హ్యాక్ చేసి ఎవరో ఈ పని చేశారు. వారిని పట్టుకొని కఠినంగా శిక్షించాలి. నేను చాలా వాట్సాప్ గ్రూపులలో మెంబర్‌గా ఉన్నాను. ఫోన్ హ్యాక్ చేసిన వాళ్లు కావాలనే ‘విలేజెస్ ఆఫ్ గోవా’ గ్రూపులో ఆ క్లిప్‌ను ఫార్వర్డ్ చేశారు. మిగతా ఏ గ్రూప్‌కు ఈ క్లిప్ పంపలేదు. ఆ క్లిప్ గ్రూప్‌లో ఆదివారం రాత్రి 1:20 గంటలకు ఫార్వర్డ్ అయింది. ఆ సమయంలో ఫోన్ నా దగ్గర కూడా లేదు. నేను అప్పటికే నిద్రపోతున్నాను. గతంలో కూడా నా పేరును, నా పరువును కించపరచడానికి మరియు ప్రజల ముందు నన్ను తప్పుగా నిలబెట్టడానికి ఇలాంటి ప్రయత్నాలు జరిగాయి. నేరపూరితంగా కావాలనే నా ఫోన్ హ్యాక్ చేసిన దుర్మార్గులపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. రాజకీయ ప్రత్యర్థులు నన్ను ఎదుర్కోలేక ఈ పని చేసి.. ఉన్నతమైన డిప్యూటీ సీఎం పదవిని కించపరిచారు’ అని కవేల్కర్ అన్నారు.

మహిళలను కించపరిచేలా పోర్న్ క్లిప్ షేర్ చేశాడని కవేల్కర్‌పై గోవా ఫార్వర్డ్ పార్టీ యొక్క మహిళా విభాగం స్థానిక ఉమెన్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆయనపై సమాచార సాంకేతిక చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేసింది.

‘వీడియో పూర్తిగా కామంతో కూడుకున్నది. లైంగిక మరియు అసభ్యకరమైన కంటెంట్ కలిగి ఉంది. ఆ వీడియోను కవేల్కర్ ఒక పబ్లిక్ గ్రూపులో పంచుకున్నాడు. అలా చేయడం వల్ల విలేజెస్ ఆఫ్ గోవా గ్రూప్‌లోని మహిళా సభ్యులు మనస్తాపం చెందారు’ అని ఉమెన్స్ వింగ్ తమ ఫిర్యాదులో పేర్కొంది.

కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా ఎన్నికైన కవేల్కర్ 2019లో బీజేపీలో చేరారు. ఒకేసారి పదిమంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. వారిలో కవేల్కర్ కూడా ఒకరు. అంతేకాకుండా.. కవేల్కర్ బీజేపీలో చేరిన తర్వాత డిప్యూటీ సీఎం కావడం గమనార్హం. ఆయన బీజేపీలో చేరకముందు గోవా అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు నిర్వర్తించారు.

For More News..

రాష్ట్రంలో మరో 1,486 కరోనా కేసులు

దసరాకు 3 వేల స్పెషల్​ బస్సులు.. 50 శాతం చార్జీల పెంపు

కొడుకు పానం బాగయితలేదని తండ్రి ఆత్మహత్య