పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ విద్యార్థులకు అలెర్ట్: బ్యాంక్ అకౌంట్లకు ఆధార్ సీడింగ్ తప్పనిసరి

పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ విద్యార్థులకు అలెర్ట్:  బ్యాంక్ అకౌంట్లకు ఆధార్ సీడింగ్ తప్పనిసరి

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ జిల్లాలో పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ పొందే బీసీ, ఈబీసీ విద్యార్థులు తమ బ్యాంక్ ఖాతాలకు ఆధార్ సీడింగ్, డీబీటీ యాక్టివేషన్ చేసుకోవడం తప్పనిసరని జిల్లా వెనకబడిన తరగతుల డిప్యూటీ డైరెక్టర్ జి.ఆశన్న ఒక ప్రకటనలో తెలిపారు. స్కాలర్‌షిప్ డబ్బులు సకాలంలో జమ కావాలంటే విద్యార్థులు వెంటనే తమ అకౌంట్​ఉన్న బ్యాంక్‌కు వెళ్లి ఎన్‌పీసీఐ పోర్టల్ ద్వారా ఆధార్ సీడింగ్ పూర్తి చేసుకోవాలన్నారు. కళాశాలల ప్రిన్సిపాళ్లు ఈ సమాచారాన్ని నోటీస్ బోర్డుల్లో పెట్టాలని సూచించారు.