ఎప్పుడొచ్చామన్నది కాదు.. బుల్లెట్ దిగిందా లేదా ..భద్రత దళాల చేతికి మరో కొత్త ఆయుధం

ఎప్పుడొచ్చామన్నది కాదు.. బుల్లెట్ దిగిందా లేదా ..భద్రత దళాల చేతికి మరో కొత్త ఆయుధం

కేంద్ర ప్రభుత్వం సరికొత్త ఆయుధాన్ని తయారు చేసింది. కాన్పూర్‌లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే అడ్వాన్స్‌డ్‌ వెపన్స్‌ అంగ్ ఎక్విప్‌మెంట్ ఇండియా లిమిటెడ్‌ ఈ రివాల్వర్‌ను రూపొందించింది. దీనిని ప్రబల్ గా నామకరణం చేసింది.  దేశీయంగా రూపొందించిన తొలి లాంగ్‌ రేంజ్‌ రివాల్వర్‌ ప్రబల్‌  ఆగస్టు 18న విడుదల కానుంది.  

ప్రబల్‌ రివాల్వర్‌ తక్కువ బరువు ఉంటుంది. స్వింగ్‌ సైడ్‌ సిలిండర్‌తో 50 మీటర్ల దూరంలోని లక్ష్యాలను ఇది చేధించగలదు. గతంలో దేశీయంగా తయారైన రివాల్వర్ల రేంజ్‌ కేవలం 20 మీటర్లు మాత్రమే . కానీ  ప్రబల్‌ 76 మి.మీ బ్యారెల్‌తో 700 గ్రాముల బరువు ఉంటుంది.  మహిళలు తమ భద్రత కోసం దీన్ని సులభంగా  తీసుకెళ్లొచ్చు. ప్రబల్‌ రివాల్వర్ బుకింగ్స్‌ ఆగస్టు 18 నుంచి ప్రారంభమవుతాయి. లైసెన్స్‌ కలిగిన సామాన్యులు సైతం దీన్ని కొనుగోలు చేయొచ్చు.  

కేంద్ర ప్రభుత్వ ఆధ్యర్యంలోని ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ బోర్డ్‌ ఏడు PSUలను 2021లో ఏర్పాటు చేసింది. వాటిలో కాన్పూర్‌లో AWEIL కూడా ఒకటి. ఈ సంస్థ భద్రతా దళాల కోసం ఆయుధాలను తయారు చేస్తుంది. ఈ ఒక్క ఏడాదే సంస్థ రూ.6 వేల కోట్ల విలువైన రక్షణ ఉత్పత్తుల తయారీకి సంబంధించిన ఆర్డర్లను  పొందింది. వీటిలో భారత సైన్యం కోసం 300 సారంగ్‌ ఫిరంగుల తయారీతోపాటు.. యూరోపియన్‌ దేశాలకు సంబంధించి రూ. 450 కోట్ల విలువైన రక్షణ ఉత్పత్తుల  ఆర్డర్లు ఉన్నాయి.