నేను జాతకాలను నమ్మను

నేను జాతకాలను నమ్మను


వరుస యాక్షన్‌‌ మూవీస్‌‌ తర్వాత ‘రాధేశ్యామ్‌‌’ లాంటి లవ్‌‌ స్టోరీలో నటించడం హ్యాపీగా ఉందంటున్నాడు ప్రభాస్‌‌. రాధాకృష్ణ  కుమార్‌‌ డైరెక్షన్‌‌లో యూవీ క్రియేషన్స్‌‌, గోపీకృష్ణ మూవీస్‌‌ సంస్థలు కలిసి నిర్మించిన ఈ సినిమా మార్చి 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌‌మీట్‌‌లో ప్రభాస్ మాట్లాడుతూ ‘నేను జాతకాలను నమ్మను. అందుకే పామిస్ట్‌‌ కథ అనగానే నో చెబుదామనుకున్నా. ఇంటర్వెల్‌‌ వరకూ విన్నాక నో చెప్పాలనుకున్నా. కానీ కథ నచ్చడంతో ఆ విషయం మర్చిపోయా. ఓకే చెప్పేశా. అయితే కథను పెదనాన్నకు చెప్పమంటే రాధాకృష్ణ చాలా టెన్షన్ పడ్డాడు. కానీ ఫస్ట్ సిట్టింగ్‌‌లోనే ఓకే అయ్యింది.  పెదనాన్న గంభీరంగా కనిపిస్తారు కానీ చాలా కూల్. మాకంటే మోడర్న్‌‌గా ఆలోచిస్తారు. నా సిస్టర్‌‌‌‌ ప్రసీద కూడా ఈ సినిమాకి ప్రొడ్యూసర్. గోపీకృష్ణా మూవీస్‌‌లో సినిమా కనుక నేను పెదనాన్న గారికి ఆన్సరబుల్‌‌. ఇందులో ఆయన పరమహంస అనే కీలకమైన పాత్రను కూడా పోషించారు. ఆ పాత్రలో ఫిలాసఫీతో పాటు చిన్న వెటకారం కూడా ఉంటుంది. మా కాంబినేషన్‌‌లో రెండు సీన్స్ ఉంటాయి. దీన్నో లవ్‌‌ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. ఫైట్స్ ఉండవు కానీ యాక్షన్, చేజింగ్ సీన్స్ ఉంటాయి. నా క్యారెక్టర్‌‌‌‌లోనే మాస్‌‌ ఉంది. నాతో లవ్‌‌ స్టోరీ చేయడానికి ఎవరైనా భయపడతారు. కానీ ఇలాంటి లవ్‌‌స్టోరీ నాతో చేసిన రాధాకృష్ణకి థ్యాంక్స్. క్లైమాక్స్‌‌లోని పదమూడు నిమిషాల షిప్‌‌ సీన్స్‌‌కి రెండేళ్లు కష్టపడ్డాడు. గ్లాడియేటర్, బ్రేవ్‌‌ హార్ట్‌‌ లాంటి సినిమాలకు వర్క్ చేసిన ఫైట్ కొరియోగ్రాఫర్‌‌‌‌ నిక్ పాల్ ఆ సీన్స్‌‌ చేశారు. వరుస యాక్షన్ సినిమాల తర్వాత ఈ మూవీ చేయడం కిక్కిచ్చింది. ఇక అమితాబ్‌‌ గారితో కలిసి నటించాలనేది నా కల. ఇన్నాళ్లకు అది ‘ప్రాజెక్ట్ కె’తో నెరవేరింది. త్వరలో ఓ కామెడీ సినిమా చేస్తున్నా. వివరాలు ఇప్పుడే చెప్పలేను’ అన్నాడు. రాధాకృష్ణ మాట్లాడుతూ ‘ప్రభాస్‌‌ వల్లే ఈ సినిమా సాధ్యమైంది. విక్రమాదిత్యగా ఆయన అందరికీ గుర్తుండిపోతారు. ప్రేరణ పాత్రలో పూజాహెగ్డే ఒదిగిపోయింది. మూడు వందల కోట్ల వరకు ఖర్చయింది. కానీ వెయ్యి కోట్ల అనుభూతినిస్తుంది’ అని చెప్పాడు. ‘ఔట్‌‌పుట్‌‌ అద్భుతంగా వచ్చింది. తప్పకుండా అందరికీ నచ్చుతుంది’ అన్నాడు మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకరన్‌‌. ‘ముందుగా ఇండియాలోనే వింటేజ్‌‌ సెట్స్‌‌లో తీయాలనుకున్నాం. కానీ బాహుబలి, సాహో చిత్రాలతో ఫిజికల్‌‌గా ఎంతో కష్టపడిన ప్రభాస్‌‌కి నెక్స్ట్ మూవీకి కాస్త రిలాక్స్డ్‌‌గా ఉండాలని ఇటలీ బ్యాక్‌‌డ్రాప్‌‌కి మార్చారు దర్శకుడు. డెబ్భైల నాటి బ్యాక్‌‌డ్రాప్‌‌ ఆలోచన మాత్రం ప్రభాస్‌‌దే’ అని చెప్పారు ప్రొడక్షన్ డిజైనర్ రవీందర్‌‌‌‌. తమన్ మాట్లాడుతూ ‘బాహుబలిలో ప్రభాస్‌‌ బాడీ సైజ్‌‌ చూశారు. ఇందులో ఆయన హార్ట్‌‌ సైజ్ చూస్తారు. ‘ముఘల్‌‌ ఎ అజమ్‌‌’ లాంటి గ్రేట్‌‌ లవ్‌‌స్టోరీస్ చూసుంటాం. టాలీవుడ్‌‌ నుంచి వస్తోన్న అలాంటి ఓ గ్రేట్‌‌ లవ్‌‌ స్టోరీ ఇది’ అన్నాడు.