ఈ డిసెంబర్ నెల మునుపటిలా ఉండదు.. ప్రశాంత్ నీల్ భార్య పోస్ట్ వైరల్

ఈ డిసెంబర్ నెల మునుపటిలా ఉండదు.. ప్రశాంత్ నీల్ భార్య పోస్ట్ వైరల్

కేజీఎఫ్(Kgf), కేజీఎఫ్2(Kgf2) సినిమాలతో ఇండియా వైడ్ స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు దర్శకుడు ప్రశాంత్ నీల్(Prashanth neel). ఇప్పుడు ఈ దర్శకుడి నుండి ఒక సినిమా వస్తుందంటే ఆ క్రేజ్ నెక్స్ట్ లెవల్లో ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహంలేదు. దానికి పర్ఫెక్ట్ ఎగ్జామ్పుల్ ఆయన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) తో తీస్తున్న సలారే(Salaar). ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. 

ప్రభాస్ ఫ్యాన్స్ సైతం ఈ సినిమా కోసం చాలా కాలంగా ఎదురుచూస్తన్నారు. అయితే ఈ సినిమా మాత్రం వాయిదాల మీద వాయిదాలు పెడుతూ అటు ఫ్యాన్స్ ను, ఇటూ  ఆడియన్స్ ను డిజప్పాయింట్ చేస్తోంది. ఇక అన్ని సెట్ అయ్యాయి సెప్టెంబర్ 28న సలార్ రిలీజ్ అవడం ఖయాం అనుకున్నారంతా కానీ.. మరోసారి సినిమాను పోస్ట్ పోన్ చేసి ఫ్యాన్స్ కు నిరాశే మిగిల్చారు. అయితే సలార్ కొత్త రిలీజ్ డేట్ పై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు మేకర్స్.

ఇదిలా ఉంటే.. సలార్ కొత్త రిలీజ్ డేట్ ఇదే అంటూ పలు రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే దర్శకుడు ప్రశాంత్ నీల్ భార్య పెట్టిన పోస్ట్ ఒకటి సలార్ రిలీజ్ డేట్ పై ఆసక్తిని పెంచింది. ఈ పోస్ట్ లో ఆమె.. ఈ డిసెంబర్ మునుపటిలా ఉండదు.. అంటూ రాసుకొచ్చారు. దీంతో ఆమె సలార్ డేట్ పైనే ఈ పోస్ట్ చేశారని, సలార్ డిసెంబర్ లో వస్తున్నాడని కన్ఫర్మ్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. మరి ఈ పోస్ట్ ఆమె ఎందుకు పెట్టింది అనేది క్లారిటీ లేదు.