
స్టావెంజర్ : ఇండియా యంగ్ గ్రాండ్ మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద.. నార్వే చెస్ టోర్నీలో తొలి ఓటమిని ఎదుర్కొన్నాడు. బుధవారం జరిగిన రెండో రౌండ్‌లో ప్రజ్ఞానంద.. వరల్డ్ చాంపియన్ డింగ్ లీరెన్ (చైనా) చేతిలో ఓడాడు. నార్మల్ టైమ్ గేమ్‌లో డ్రా చేసుకున్న ఇండియన్ గ్రాండ్ మాస్టర్ అర్మెగెడాన్ టైబ్రేక్‌లో మాత్రం లీరెన్‌ను నిలువరించలేకపోయాడు. ఈ రౌండ్ తర్వాత ప్రజ్ఞానంద 2 పాయింట్లతో సంయుక్తంగా మూడో ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. విమెన్స్ సెక్షన్‌లో ఆర్. వైశాలి(4).. తెలుగు గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి(1.5)ని ఓడించింది.