
న్యూఢిల్లీ: అబార్షన్‌కు అనుమతించేందుకు ఇప్పటి వరకున్న 20 వారాల గడువును 24 వారాలకు పెంచే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ఓకే చెప్పింది. డాక్టర్లు, మహిళలు డిమాండ్ చేస్తున్నట్లు 6 నెలల్లోపల అబార్షన్ చేసుకోవడానికి సమ్మతించింది. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ(ఎంటీపీ– అమెండ్మెంట్) బిల్2020కు ఆమోదం తెలిపింది. ఈ సవరణ బిల్లును శుక్రవారం నుంచి మొదలయ్యే బడ్జెట్ సమావేశాల్లోనే పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. బుధవారం ఢిల్లీలో జరిగిన కేబినెట్ మీటింగ్ తర్వాత కేంద్ర మంత్రి ప్రకాశ్ జవడేకర్ మీడియాతో మాట్లాడారు. అబార్షన్ లిమిట్ పెంచడం ద్వారా వద్దనుకున్న గర్భాన్ని జాగ్రత్తగా తొలగించుకునే అవకాశంతో పాటు మహిళలకు వారి శరీరాల మీద రీప్రొడక్టివ్ హక్కులను కల్పించామని చెప్పారు.
అత్యాచార బాధితులు, మైనర్లు, వైకల్యంతో బాధపడుతున్న వారు.. గర్భందాల్చినా కూడా ఐదు నెలల్లో తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నవారు తర్వాత అబార్షన్ కోసం కోర్టులను ఆశ్రయించాల్సి వస్తోందని మంత్రి చెప్పారు. తాజా ప్రతిపాదన ద్వారా అలాంటి కేసుల్లో బాధితులకు ఊరట లభిస్తుందని వివరించారు. మెటర్నల్ మోర్టాలిటీ కూడా తగ్గుతుందని మంత్రి జవడేకర్ అన్నారు.
ఈ బిల్లులో కీలక విషయాలు..
20 వారాల్లోపల అబార్షన్‌కు ఓ డాక్టర్ సలహా సరిపోతుంది. 20 వారాలు దాటితే ఇద్దరు డాక్టర్ల(ఒక ప్రభుత్వ డాక్టర్) అభిప్రాయం తప్పనిసరి.
అబార్షన్ చేసుకున్న మహిళ వివరాలను బయటికి వెల్లడించొద్దు.. ఇప్పుడున్న చట్టాల్లో దీనికి సంబంధించి వెసులుబాటు ఉంటే ఆ చట్ట ప్రకారం అనుమతి పొందిన వారికి చెప్పొచ్చు. పిండం ఎదుగుదలలో అసాధారణ లోపాలకు సంబంధించిన కేసులకు ఈ అబార్షన్ గడువు వర్తించదు. అంటే.. 20 వారాల తర్వాత పిండంలో లోపాలు బయటపడితే అబార్షన్ చేయడానికి వీలులేదు. ఈ కేసుల్లో అబార్షన్ గడువులో ఎలాంటి మార్పులేదు.
ఈ సవరణలకు సంబంధించిన విధివిధానాల్లో మెడికల్ బోర్డ్ సమయానుసారంగా మార్పులు చేర్పులు తీసుకొస్తుంది. హ్యుమానిటేరియన్, సోషల్గ్రౌండ్స్కింద మహిళలకు సేఫ్, లీగల్ అబార్షన్ సర్వీస్‌ను అందించడానికే ఎంటీపీ చట్టానికి సవరణలను ప్రతిపాదించినట్లు కేంద్రం వెల్లడించింది.