త్వరలోనే జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు

త్వరలోనే జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు

త్వరలోనే జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ఆయన ప్రసంగించారు. ‘ జమ్మూ కాశ్మీర్‌లో డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేయబడింది. భవిష్యత్తులో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అందరి సామర్థ్యానికి న్యాయమైన అవకాశాలు ఇవ్వడమే ప్రజాస్వామ్యం యొక్క నిజమైన స్ఫూర్తి. ఆర్టికల్ 370ని రద్దు చేశాం. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్‌లో మొట్టమొదటిసారిగా జిల్లా అభివృద్ధి మండలి ఎన్నికలను నిర్వహించి దేశ సంకల్పాన్ని ప్రతిబింబించేలా చేశాం. జమ్మూ కాశ్మీర్ విభజన తర్వాత కేంద్రపాలిత ప్రాంతంగా రూపుదిద్దుకున్న లడఖ్ అభివృద్ధి వైపు దూసుకెళ్తోంది. ఆ క్రమంలో ‘సింధు సెంట్రల్ యూనివర్శిటీ’ లడఖ్‌ను ఉన్నత విద్యాకేంద్రంగా మార్చబోతోంది’ అని ఆయన అన్నారు.