ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

మహబూబాబాద్, వెలుగు: మహబూబాబాద్​ జిల్లా బయ్యారం మండలం నామాలపాడు  గ్రామంలో నిర్మించిన ఏకలవ్య మోడల్​స్కూల్​ను బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భద్రాచలం నుంచి వర్చువల్​గా ప్రారంభించారు.  ఈ స్కూల్​ను కేంద్ర గిరిజన మంత్రిత్వశాఖ ద్వారా రూ.35 కోట్లతో  9.35 ఎకరాల్లో నిర్మించారు. రాష్ట్రపతి మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా  గిరిజనులకు నాణ్యమైన విద్యనందించేందుకు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రారంభించడం ఎంతో గొప్పవిషయమన్నారు. స్టూడెంట్స్​ ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ గురుకులం ఏర్పాటుతో గిరిజనులకు మెరుగైన విద్య అందుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్​ శశాంక, ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ, జడ్పీ చైర్మన్​ ఆంగోతు బిందు, ఎంపీపీ మౌనిక, సర్పంచ్ రవికిరణ్, ఎంపీటీసీ ఉపేంద్ర, ఏకలవ్య మోడల్ స్కూల్ డిప్యూటీ సెక్రటరీ చంద్రశేఖర్, ఆర్సీవో రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.

సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోనే  రాష్ట్ర అభివృద్ధి

స్టేషన్​ఘన్​పూర్​, వెలుగు: సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్​ను  ఎదుర్కొనే సత్తా ఏ పార్టీకి లేదని ఎమ్మెల్యే డా.రాజయ్య అన్నారు. హనుమకొండలో నియోజకవర్గ బీఆర్ఎస్​ లీడర్లతో బుధవారం ఆయన సమావేశమయ్యారు. నియోజకవర్గంలో పార్టీకి మరింత ప్రజాదరణ తీసుకువచ్చేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ  ఎంపీపీలు, జడ్పీటీసీలు, మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో గ్రామాలకు వెళ్లి ఎమ్మెల్యే సందేశాలతో కూడిన పాంప్లెట్స్​ను ఓటర్లకు పంపిణీ చేయాలన్నారు. కేసీఆర్​ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలపై ఇంటింటా సర్వే చేయాలన్నారు.

‘జనగామ’  వార్షిక ప్రణాళిక రూ.3042.90 కోట్లు

జనగామ అర్బన్, వెలుగు:  జనగామ జిల్లాకు సంబంధించి 2023-–24 వార్షిక బడ్జెట్​ రూ.3042.90 కోట్లుగా ఉంటుందని కలెక్టర్​ సీహెచ్ శివలింగయ్య ప్రకటించారు. ఈ మేరకు కలెక్టరేట్​లో బుధవారం ప్రణాళిక సంపుటిని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన జిల్లా స్థాయి మీటింగ్​లో కలెక్టర్​ మాట్లాడారు. 2022–-23 వార్షిక బడ్జెట్​ రూ.2838.92 కోట్లు కాగా ఇప్పటివరకు రూ.1148.79 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు. మిగతా లక్ష్యాన్ని గడువులోగా పూర్తి చేయాలని బ్యాంకర్లను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, సబ్​ప్లాన్లు, పీఎం ఈజీసీ పెండింగ్​ యూనిట్లు పూర్తి చేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీపై అందిస్తున్న లోన్లపై ప్రచారం చేయాలన్నారు. సమావేశంలో అడిషనల్​ కలెక్టర్​ ప్రపుల్​దేశాయ్​, ఆర్బీఐ ఎల్​డీవో రాజేంద్రప్రసాద్​, నాబార్డ్​ డీడీఎం చంద్రశేఖర్​, ఎస్బీఐ ఏజీఎం అలీమొద్దీన్​, ఎల్​డీఎం ఎం. శ్రీధర్​, డీఆర్డీఏ పీడీ రాంరెడ్డి పాల్గొన్నారు. 

తొలిమెట్టు మేళా ఉందని.. బడికి తాళం తీయలే..

వర్ధన్నపేట, వెలుగు: తొలిమెట్టు(టీఎల్ఎం) మేళా ఉందని బడికి తాళం తీయలేదు. వివరాలిలా ఉన్నాయి.. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్రంలో టీఎల్ఎం మేళా ఉండడంతో బుధవారం నల్లబెల్లి గ్రామంలో ప్రైమరీ స్కూల్ కు తాళం తీయలేదు. స్కూల్​లో ఐదుగురు టీచర్లు ఉండగా ఒక్కరే హాజరయ్యారు. హాజరైన ఆ టీచర్​ కూడా స్కూల్​తాళం తీయకుండానే బయట చెట్టుకింద విద్యార్థులను కూర్చొబెట్టాడు. విద్యార్థుల తల్లిదండ్రులు టీచర్​ను ప్రశ్నించగా టీఎల్ఎం మేళా ఉందని.. ఎలాగూ ఒక్క పూట స్కూలే కదా అని తాళం తీయలేదని సమాధానమిచ్చాడు. దీనిపై ఎంఈవో రంగయ్యను వివరణ కోరగా స్కూల్​లో ఉన్న టీచర్లలో కచ్చితంగా 50శాతం స్కూల్​కు హాజరుకావాలి. తాళం చెవి ఉన్న టీచర్​టీఎల్ఎం మేళాకు హాజరుకావడంతో ఇలా జరిగిందని, విషయం తెలిసిన వెంటనే సదరు టీచరును పంపించామని చెప్పారు. 

బీజేపీకి ఒక్క చాన్స్​ ఇవ్వండి

నెక్కొండ, వెలుగు: నర్సంపేట నియోజకవర్గంలో బీజేపీకి చాన్స్​ ఇవ్వండి.. డెవలప్​మెంట్​ చేసి చూపిస్తామని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్​రెడ్డి అన్నారు. బుధవారం నెక్కొండ మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన వివిధ పార్టీల కార్యకర్తలు ఆయన సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని చెప్పారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్​ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలుచేయలేదన్నారు. బీజేపీ లీడర్లు అజయ్​కుమార్​, సంతోష్​నాయక్​, రాంగోపాల్​, ధర్మారెడ్డి, అనిల్​గౌడ్​, వెంకన్న, మల్లికార్జున్​, వీరస్వామి పాల్గొన్నారు.

పర్మిషన్​ లేకుండా నిరసనలు చేపడితే చర్యలు

హనుమకొండ, వెలుగు: వరంగల్ కమిషనరేట్​ పరిధిలో ముందస్తు పర్మిషన్​లేకుండా ధర్నాలు, నిరసనలు, ర్యాలీలు చేపడితే  చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సీపీ ఏవీ రంగనాథ్​ హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.  ప్రజలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఎలాంటి నిరసన చేపట్టాలన్నా ముందస్తు పర్మిషన్​తీసుకోవాలన్నారు.  ఇటీవల కొంతమంది వివిధ కారణాలతో చనిపోయిన వ్యక్తుల డెడ్​బాడీలతో ఇండ్లు, గవర్నమెంట్ ఆఫీసుల ఎదుట ఆందోళనలు చేస్తూ డబ్బులు డిమాండ్​ చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ఏదైనా సమస్య ఉంటే చట్టపరంగా వెళ్లాలని సీపీ సూచించారు.

పన్నుల వసూళ్లను స్పీడప్​ చేయండి

వరంగల్​సిటీ, వెలుగు: పన్నుల వసూళ్లు  స్పీడప్​ చేసి, నిర్దేశించిన లక్ష్యం సాధించాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ ప్రావీణ్య రెవెన్యూ అధికారులను ఆదేశించారు. బుధవారం జీడబ్ల్యూఎంసీ హెడ్డాఫీసులో జరిగిన సమావేశంలో సర్కిళ్ల వారీగా పన్నుల సేకరణ, మ్యుటేషన్, పెండింగ్ ఫైల్స్ పురోగతి పై కమిషనర్​సమీక్షించారు. కమిషనర్ మాట్లాడుతూ 2022–23 ఆర్థిక సంవత్సరానికి బల్దియా పరిధిలో రూ.91.91 కోట్ల పన్ను వసూలు లక్ష్యం కాగా, ఇప్పటివరకు 49.38 కోట్లే వసూలు చేశారని మిగిలిన రూ 42.53 కోట్లు వసూలు చేయాలన్నారు.  ఆర్ఐల వారీగా రోజువారీ  వసూళ్ల లక్ష్యం విధించామని, లక్ష్యం సాధించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. బడా బకాయిదారులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి పన్నులు వసూలు చేయాలన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఖాళీ స్థలాలకు ఇంటి నంబర్ల కేటాయింపు, ఆస్తి పేరు మార్పిడి, బైఫర్​కేషన్, కొత్త అసెస్​మెంట్​తదితర  విజ్ఞాపనలు  వినతులు, సమస్యలను గడువులోగా  పరిష్కరించేలా రెవెన్యూ ఆఫీసర్లు, ఉప కమిషనర్లు  పర్యవేక్షించాలని అన్నారు. సమీక్షలో ఉప కమిషనర్లు అనిస్ ఉర్ రషీద్,  జోనా, శ్రీనివాస్ రెడ్డి, సిటీ ప్లానర్ వెంకన్న, డీసీపీ ప్రకాశ్​రెడ్డి, ఏసీపీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.