వరంగల్ సిటీ, వెలుగు: వరంగల్ ఎంజీఎంలో కలెక్టర్ సత్యశారద శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రోగులతో మాట్లాడుతూ పెద్ద డాక్టర్లు వస్తున్నారా? మందులు సరిగా ఇస్తున్నారా? మీకు ఇబ్బందులు ఉన్నాయా అంటూ వివరాలు సేకరించారు. ఆస్పత్రిలోని మెడికల్, ఆర్థోపెడిక్, సర్జరీ వార్డులతోపాటు ల్యాబ్లు, రేడియాలాజీ విభాగాన్ని ఆమె సందర్శించారు.
అనంతరం కలెక్టర్ ఆస్పత్రిలో అందిస్తున్న వైద్య సేవలను సమీక్షించేందుకు వివిధ విభాగాలను స్వయంగా పరిశీలించి, వైద్యులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో రామ్ రెడ్డి, డీఎంహెచ్వో సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.
