వర్చువల్‌ విధానంలో క్రీడా అవార్డులను అందజేసిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌

వర్చువల్‌ విధానంలో క్రీడా అవార్డులను అందజేసిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా అథ్లెట్లకు క్రీడా అవార్డులను అందజేశారు. హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్‌ జయంతిని పురస్కరించుకొని దేశంలోని క్రీడాకారులకు ప్రతిభకు తగిన గుర్తింపుతో సత్కరిస్తారు.  ప్రతి ఏడాది ఢిల్లీలోని సాయ్ కేంద్ర కార్యాలయంలో నిర్వహించే ఈ కార్యక్రమానిన్న కరోనా వ్యాప్తి కారణంగా వర్చువల్‌ విధానంలో నిర్వహించారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్. మొత్తం 65 మంది అథ్లెట్లకు అవార్డులు ప్రటించారు. వర్చువల్ విధానంలో… ఒకే సమయంలో దేశవ్యాప్తంగా బెంగళూరు, పుణె, సోనేపట్, చండీగఢ్, కోల్‌కతా, లక్నో, ఢిల్లీ, ముంబై, భోపాల్, హైదరాబాద్, ఈటానగర్‌లో ఒకేసారి జరిగింది.

రాష్ట్రాలవారిగా రాష్ట్రపతి ఆయా క్రీడాకారుల పేర్లు పిలవగా వారంతా వేదికపైకి వచ్చి అవార్డులు అందుకున్నారు. ఐదుగురికి రాజీవ్‌ ఖేల్‌ రత్న ప్రకటించగా, 27 మందికి అర్జున అవార్డులు అందజేశారు. రోహిత్‌శర్మ (క్రికెట్‌), వినేశ్‌ ఫొగాట్‌ (రెజ్లింగ్‌), రాణి రాంపాల్‌ (హాకీ), మరియప్పన్‌ తంగవేలు (పారా అథ్లెటిక్స్‌), మనిక బాత్రా (టీటీ)లకు అత్యున్నత పురస్కారం లభించింది. మరోవైపు ఐపీఎల్‌ ఆడటానికి దుబాయ్‌ వెళ్లిన టీమ్‌ఇండియా క్రికెటర్లు రోహిత్‌శర్మ (ఖేల్‌రత్న), ఇషాంత్‌శర్మ (అర్జున) తిరిగొచ్చాక తమ పురస్కారాలను అందుకోనున్నట్లు సమాచారం.

సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌శెట్టి (బ్యాడ్మింటన్‌), ఇషాంత్‌శర్మ (క్రికెట్‌), సాక్షి మలిక్‌ (రెజ్లింగ్‌), ద్యుతిచంద్‌ (అథ్లెటిక్స్‌), దివ్య కర్కాన్‌ (రెజ్లింగ్‌), అతానుదాస్‌ (ఆర్చరీ), దీపక్‌ హుడా (కబడ్డీ), దీపిక (హాకీ), దివిజ్‌శరణ్‌ (టెన్నిస్‌), మీరాబాయ్‌ (వెయిట్‌లిఫ్టింగ్‌), ఆకాశ్‌దీప్‌ (హాకీ), లవ్లీనా (బాక్సింగ్‌), మనూ బకర్‌ (షూటింగ్‌), సౌరభ్‌ చౌదరి (షూటింగ్‌), మనీష్‌ (బాక్సింగ్‌), సందేశ్‌ (ఫుట్‌బాల్‌), దత్తు బొకానల్‌ (రోయింగ్‌), రాహుల్‌ అవారె (రెజ్లింగ్‌), దీప్తిశర్మ (క్రికెట్‌), శివ కేశవన్‌ (వింటర్‌ స్పోర్ట్స్‌), మధురిక (టీటీ), మనీష్‌ నర్వాల్‌ (పారా షూటర్‌), సందీప్‌ (పారా అథ్లెట్‌), సుయాంశ్‌ (పారా స్విమ్మర్‌), విశేష్‌ (బాస్కెట్‌బాల్‌), అజయ్‌ (టెంట్‌ పెగ్గింగ్‌), అదితి అశోక్‌ (గోల్ఫ్‌), సారిక (ఖోఖో).

ద్రోణాచార్య లైఫ్‌టైమ్‌ గ్రహీతలు:

ధర్మేంద్ర తివారి (ఆర్చరీ), పురుషోత్తం (అథ్లెటిక్స్‌), శివ్‌ సింగ్‌ (బాక్సింగ్‌), రొమేశ్‌ (హాకీ), కృషన్‌కుమార్‌ (కబడ్డీ), విజయ్‌ బాలచంద్ర (పారా పవర్‌ లిఫ్టింగ్‌), నరేశ్‌కుమార్‌ (టెన్నిస్‌), ఓంప్రకాశ్‌ దహియా (రెజ్లింగ్‌) జూడ్‌ ఫెలిక్స్‌ (హాకీ), యోగేశ్‌ (మల్లఖంబ్‌), జస్పాల్‌ రాణా (షూటింగ్‌), కుల్దీప్‌కుమార్‌ (వుషు), గౌరవ్‌ ఖన్నా (పారా బ్యాడ్మింటన్‌)

ధ్యాన్‌చంద్‌ అవార్డుల గ్రహీతలు:

కుల్దీప్‌సింగ్‌ (అథ్లెటిక్స్‌), జిన్సీ ఫిలిప్స్‌ (అథ్లెటిక్స్‌), ప్రదీప్‌ శ్రీకృష్ణ (బ్యాడ్మింటన్‌), తృప్తి ముర్గుండే (బ్యాడ్మింటన్‌), ఉష (బాక్సింగ్‌), లఖాసింగ్‌ (బాక్సింగ్‌), సుఖ్విందర్‌సింగ్‌ (ఫుట్‌బాల్‌), అజిత్‌సింగ్‌ (హాకీ), మన్‌ప్రీత్‌ (కబడ్డీ), రంజిత్‌కుమార్‌ (పారా అథ్లెటిక్స్‌), సత్యప్రకాశ్‌ (పారా బ్యాడ్మింటన్‌), మంజీత్‌సింగ్‌ (రోయింగ్‌), సచిన్‌ నాగ్‌ (స్విమ్మింగ్‌), నందన్‌ (టెన్నిస్‌), నేతర్‌పల్‌ (రెజ్లింగ్‌).వీరిలో రెజ్లర్‌ వినేశ్‌ ఫొగట్‌ (ఖేల్‌రత్న), తెలుగు బ్యాడ్మింటన్‌ స్టార్‌ సాత్విక్‌ సాయిరాజ్‌ (అర్జున) కరోనా బారిన పడ్డారు. దీంతో వారు కోలుకున్నాక సాయ్‌ కేంద్రాల్లో ఈ అవార్డులను అందుకోనున్నారు.