370, 35Aని రద్దు చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు

370, 35Aని రద్దు చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు

370, 35A ఆర్టికల్ ను రద్దు చేస్తున్నట్లు రాజ్యసభలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రతిపాదించారు.  జమ్ము కశ్మీర్ ను లడక్, జమ్ము కశ్మీర్ లు గా విభజించనున్నట్టు తెలిపారు. దీంతో 370, 35Aని రద్దు చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు.

లడక్, జమ్ము కశ్మీర్ లను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు చేయనున్నామని…. అయితే జమ్ము కశ్మీర్ కు అసెంబ్లీ ఉంటదని, లడక్ లో అసెంబ్లీ ఉండదని ప్రతిపాదించారు అమిత్ షా. దీంతో జమ్మూ కశ్మీర్ ప్రత్యేక ప్రతి పత్తిని కోల్పోయింది. విపక్షాలు ఆందోళనకు దిగాయి.. రాజ్యసభలో గందరగోళం ఏర్పడింది. బిల్లు పాస్ అయితే 370 ఆర్టికల్ రద్దు కానుంది.