రాష్ట్రంలో కిలో ఉల్లి ధర రూ.170

రాష్ట్రంలో కిలో ఉల్లి ధర రూ.170

రాష్ట్రంలో ఉల్లి ధరలు మరింతగా పెరిగాయి. బహిరంగ మార్కెట్లో కిలో ఉల్లిపాయల ధర ఏకంగా రూ. 170కు చేరుకుంది. గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో ధర లేదు. హోల్ సేల్ మార్కెట్లో నాణ్యమైన ఉల్లి ధర రూ. 145కు పెరిగింది. హైదరాబాద్ లోని మలక్ పేట మార్కెట్ లో క్వింటాలు ఉల్లికి రూ. 14,500 పలకడం ఇదే మొదటి సారి అంటున్నారు వ్యాపారులు.

రెండో రకం ఉల్లి రూ. 12,000, మూడో రకం ఉల్లి రూ. 8 వేలు, నాసిరకం ఉల్లి రూ. 7,000 వరకూ ధర పలుకుతోంది. రెండు కిలోల ఉల్లిపాయలు కొనుగోలు చేసేవారు ఇప్పుడు అరకిలో, పావుకిలోతో సరిపెట్టుకుంటున్నారు. వర్షాల కారణంగా పంట దెబ్బతినడంతో పాటు, డిమాండ్ కు తగ్గ సరఫరా లేకపోవడంతో ధరలు భారీగా పెరిగాయంటున్నారు.