గ్రాండ్ గా అర్జున్ కుమార్తె ఐశ్వర్య రిసెప్షన్

గ్రాండ్ గా అర్జున్ కుమార్తె ఐశ్వర్య రిసెప్షన్

నటుడు అర్జున్ కుమార్తె ఐశ్వర్య, నటుడు తంబి రామయ్య కుమారుడు ఉమాపతి వివాహబంధంతో ఒక్కటయ్యారు. తాజాగా చెన్నైలో జరిగిన రిసెప్షన్ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.  తమిళనాడు సీఎం స్టాలిన్, హీరోలు రజినీకాంత్, ఉపేంద్ర, శివ  కార్తికేయన్, విజయ్ సేతుపతి,  దర్శకులు శంకర్, లోకేష్ కనక రాజ్, ప్రభుదేవా,  సత్యరాజ్, కుష్బూ తదితరులు  హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.