డాడ్ విత్ లిటిల్ ప్రిన్సెస్

డాడ్ విత్ లిటిల్ ప్రిన్సెస్

ఆదివారం ఫాదర్స్ డే సందర్భంగా పలువురు స్టార్ హీరోలు తమ స్పెషల్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వాటిలో రామ్ చరణ్ చేసిన పోస్ట్ మరింత అట్రాక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలిచింది. గతేడాది జూన్‌‌‌‌‌‌‌‌లో చరణ్‌‌‌‌‌‌‌‌కు కూతురు పుట్టిన సంగతి తెలిసిందే. తనకు క్లీంకార అని పేరు పెట్టారు. అయితే ఇప్పటివరకు ఆమె ముఖాన్ని చూపించని చరణ్.. ఫాదర్స్ డే సందర్భంగా ‘క్లీంకార’ను ఎత్తుకున్న ఫొటోను పోస్ట్ చేసి కూతురితో ఉన్న బాండింగ్‌‌‌‌‌‌‌‌ గురించి చెప్పుకొచ్చాడు. ‘నేను ఇంట్లో ఉంటే.. క్లీంకారకి రోజుకు రెండుసార్లు తినిపిస్తా. నేను గోరు ముద్దలు పెడితే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే. ఆ విషయంలో నన్నెవరూ బీట్ చేయలేరు’ అని అన్నాడు. అలాగే తాను షూటింగ్స్‌‌‌‌‌‌‌‌లో ఉంటే క్లీంకారను ఎంతో మిస్ అవుతానని చరణ్ చెప్పాడు. ఇదిలా ఉంటే ‘డాడ్ విత్ లిటిల్ ప్రిన్సెస్’ అంటూ ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌‌‌‌‌‌‌‌ అవుతోంది. రామ్ చరణ్ ప్రస్తుతం ‘గేమ్ చేంజర్’ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. అలాగే బుచ్చిబాబు డైరెక్షన్‌‌‌‌‌‌‌‌లో ఓ మూవీ చేస్తున్నాడు.