భలే ఉన్నాడే .. సెకండ్ సింగిల్‌‌‌‌‌‌‌‌ రిలీజ్

భలే ఉన్నాడే .. సెకండ్ సింగిల్‌‌‌‌‌‌‌‌ రిలీజ్

రాజ్‌‌‌‌‌‌‌‌ తరుణ్, మనీషా కంద్కూర్ జంటగా  జె శివసాయి వర్ధన్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘భలే ఉన్నాడే’.  డైరెక్టర్ మారుతి సమర్పణలో ఎన్వీ కిరణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు ఒక సాంగ్‌‌‌‌‌‌‌‌తో  ఇంప్రెస్ చేసిన టీమ్.. తాజాగా ఈ మూవీ నుంచి ‘సెట్ అవుతుందా’ అంటూ సాగే  సెకండ్ సింగిల్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు. శేఖర్ చంద్ర కంపోజ్ చేసిన ఈ మెలోడీకి కృష్ణ కాంత్ క్యాచీ లిరిక్స్ రాశాడు. కపిల్ కపిలన్ పాడిన విధానం ఆకట్టుకుంది. ‘ఏమవునో ఏమవునో.. ఈ జంట ఏమవునో.. ఎందాక సాగేనో ఈ పయనం తెలుసా.. అణకువతో ఉంటారే ఒకరు.. కల కంటూ ఉంటారు ఇంకొకరు.. ఈ జంట కలిసేదేలా.. సెట్ అవుతుందా పెయిర్.. రైటో రాంగో వీరు.. మిస్టరీ వీడేదెప్పుడో తెలుసా..ఇద్దరి లోకాలే వేరు.. ఎవరు తగ్గేలా లేరు.. గమ్యం చేరే దారే తెలుసా’ అంటూ సాగిన పాటలో రాజ్ తరుణ్, మనీషా జంట ఎలా కలుసుకుంటారనే దానిపై ఆసక్తిని పెంచేలా ఉంది.  సింగీతం శ్రీనివాస్, అభిరామి, లీలా శాంసన్, వీటీవీ గణేష్, హైపర్ ఆది, కృష్ణ భగవాన్, గోపరాజు రమణ, శ్రీకాంత్ అయ్యంగార్, సుదర్శన్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ మూవీ రిలీజ్ డేట్‌‌‌‌‌‌‌‌ను త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు.