సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఉదయం హుస్నాబాద్ టౌన్ లో మార్నింగ్ వాక్ లో భాగంగా పబ్లిక్ ను కలిశారు. బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు మంత్రి. స్థానికులు, వ్యాపారులను కలిసి మాట్లాడారు.
సమస్యలను మంత్రి దృష్టికి తీసుకురాగా అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఎలాంటి సమస్య అయినా తనకు చెప్పాలన్నారు పొన్నం. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్.
