రామ్ చరణ్ ‘పెద్ది’ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా బాలకృష్ణ? నిర్మాత వెంకట సతీష్ మైండ్ బ్లోయింగ్ క్లారిటీ!

రామ్ చరణ్ ‘పెద్ది’ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా బాలకృష్ణ? నిర్మాత వెంకట సతీష్ మైండ్ బ్లోయింగ్ క్లారిటీ!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  హీరోగా నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ (Peddi) . రీసెంట్‌గా ముంబైలో విడుదలైన మైండ్ బ్లోయింగ్ ట్రైలర్ నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. క్రికెటర్, అథ్లెట్, రెజ్లర్‌గా చరణ్ చూపించిన విశ్వరూపానికి, బుచ్చిబాబు సానా టేకింగ్‌కు, ఏఆర్ రెహమాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ తో ఈ చిత్రంపై అంచనాలను రెట్టింపు చేస్తుంది. జూన్ 4న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో..  మేకర్స్ ప్రమోషన్ల స్పీడ్ పెంచారు. దేశవ్యాప్తంగా 7 నగరాల్లో 8 భారీ ఈవెంట్లకు ప్లాన్ చేస్తుండగా, భోపాల్‌లో ఒక మ్యూజికల్ కాన్సెర్ట్ కూడా నిర్వహించనున్నారు.

జూన్ 2న ప్రీ-రిలీజ్ ఈవెంట్!
ఈ క్రమంలోనే టాలీవుడ్ హిస్టరీలోనే ల్యాండ్‌మార్క్‌గా నిలిచిపోయేలా జూన్ 2న హైదరాబాద్‌లో ‘పెద్ది’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. అయితే, ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో, సోషల్ మీడియాలో ఒకే ఒక్క క్రేజీ గాసిప్ గట్టిగా వినబడుతోంది. ఈ వేడుకకు చీఫ్ గెస్ట్‌గా నటసింహం నందమూరి బాలకృష్ణ రాబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ ఊహాగానాలపై వృద్ధి సినిమాస్ అధినేత, నిర్మాత వెంకట సతీష్ కిలారు స్పందిస్తూ.. గెస్ట్ ఎవరనేది ఇంకా ఫైనల్ కాలేదు, బాలయ్యని అడగాల్సి ఉంది అని సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారు.  అయితే ఇండస్ట్రీ టాక్ ప్రకారం బాలయ్య రావడం దాదాపు ఖాయమేనని అంటున్నారు.

బాలయ్య రాక వెనుక ఉన్న అసలు ట్విస్ట్ ఇదే!
సాధారణంగా ఒకే ప్రొడక్షన్ హౌస్‌లో తదుపరి సినిమా చేసే హీరోలను ప్రస్తుత సినిమా ఈవెంట్‌కు పిలవడం టాలీవుడ్‌లో ఒక సెంటిమెంట్. ‘పెద్ది’ చిత్రాన్ని నిర్మిస్తున్న వృద్ధి సినిమాస్ (Vriddhi Cinemas) బ్యానర్‌లోనే బాలకృష్ణ తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్నారు.. ఈ కనెక్షన్‌తోనే బాలయ్య ఈ ఈవెంట్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

ఫ్యాన్ వార్స్‌కు ఫుల్‌స్టాప్..
 గతంలో ‘అన్‌స్టాపబుల్’ టాక్ షోలో బాలకృష్ణ-రామ్ చరణ్ మధ్య ఉన్న బాండింగ్, ఒకరిపై ఒకరికి ఉన్న గౌరవం దేశమంతటా చూసింది. ఈ ఇద్దరు టాప్ స్టార్స్ ఒకే వేదికపై చేతులు కలిపితే.. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మధ్య జరిగే అనవసరపు వార్స్‌కు చెక్ పడినట్లే అన్న టాక్ విపిస్తోంది. మెగా-నందమూరి అభిమానులకు ఒక ఫెస్టివల్ లాంటి ఈ కాంబో గనుక జూన్ 2న స్టేజ్ పైన సాకారమైతే, ‘పెద్ది’ హైప్ నెక్స్ట్ లెవెల్‌కు వెళ్లడం ఖాయం అన్న ధీమా వ్యక్తం అవుతోంది. అటు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కోసం ఫ్యాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు.