డ్రగ్​ వండిన్రు.. ఊచలు లెక్కబెడుతున్రు..

డ్రగ్​ వండిన్రు.. ఊచలు లెక్కబెడుతున్రు..

వాళ్లిద్దరూ ఓ కాలేజీలో కెమిస్ట్రీ ప్రొఫెసర్లు. కెమికల్స్​తో రియాక్షన్లు చేయించి చేయించి.. వాటిని వండడం బాగా వంటబట్టినట్టుంది. అందుకే ల్యాబ్​లోనే మెథాంఫిటామైన్​(మెథ్) అనే డ్రగ్​ను వండడం మొదలుపెట్టారు. పారాఫెర్నాలియా అనే డ్రగ్​తో మెథ్​ను తయారు చేయడం ప్రారంభించారు. వాసన పసిగట్టిన పోలీసులు కాలేజీలో దర్యాప్తు చేసి ఆ ఇద్దరు కెమిస్ట్రీ ప్రొఫెసర్లు టెర్రీ డేవిడ్​ బేట్​మన్​, బ్రాడీ అలెన్​ రోలాండ్ అమెరికాలోని అర్కాన్సస్​లో ఉన్న క్లార్క్​ కౌంటీలోని హెండర్సన్​ స్టేట్​ యూనివర్సిటీలో పనిచేస్తున్నారు. వాళ్లిద్దరూ అక్టోబర్‌ 11 నుంచి సెలవులో ఉన్నారని యూనివర్సిటీ యాజమాన్యం ప్రకటించింది.