మహిళల హక్కుల సాధనే పీవోడబ్ల్యూ లక్ష్యం : నివేదిత మీనన్

మహిళల హక్కుల సాధనే పీవోడబ్ల్యూ లక్ష్యం : నివేదిత మీనన్
  •     జేఎన్​యూ ప్రొఫెసర్ నివేదిత మీనన్
  •     ఘనంగా అర్ధ శతాబ్ది వార్షికోత్సవం

ముషీరాబాద్, వెలుగు : మహిళల హక్కుల సాధన కోసం పోరాటాలు చేస్తూ వారి  సమగ్ర అభివృద్ధికి ప్రొగ్రెసివ్ ఆర్గనైజేషన్ ఫర్ విమెన్(పీవోడబ్ల్యూ) సంఘం కృషి చేస్తోందని ఢిల్లీ జేఎన్​యూ ప్రొఫెసర్ నివేదిత మీనన్ పేర్కొన్నారు. శనివారం బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పీవోడబ్ల్యూ అర్ధ శతాబ్ది వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

ప్రొఫెసర్ నివేదితతో పాటు రిటైర్డ్ ప్రొఫెసర్ రమా మేల్కోటే, ప్రొఫెసర్ హులింగ్ సిటౌ, పీవోడబ్ల్యూ నేతలు ఝాన్సీ, అంబిక, సంధ్య, విమలక్క హాజరై మాట్లాడారు. మహిళల  సమస్యలపై పీవోడబ్ల్యూ పోరాడుతోందన్నారు.