Danush Raayan Official Update: రాయన్‌ క్రైమ్లో దిగుతున్నాడు గెట్ రెడీ..ఫస్ట్ సింగిల్తో పాటు రిలీజ్ అప్డేట్

Danush Raayan Official Update: రాయన్‌ క్రైమ్లో దిగుతున్నాడు గెట్ రెడీ..ఫస్ట్ సింగిల్తో పాటు రిలీజ్ అప్డేట్

తమిళ స్టార్ హీరో ధనుష్ వరుస సినిమాలతో దూసుకెళుతున్నారు. ఆయన హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న తాజా మూవీ రాయన్. ఇది ధనుష్ కెరియర్లో 50వ సినిమాగా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టైటిల్,ఫస్ట్ లుక్‍ పోస్టర్ రిలీజ్ చేయగా..ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

రాయాన్ ఫస్ట్ లుక్ పోస్టర్లో ధనుష్ రక్తంతో తడిచిన చేతితో పిడికిలి బిగించి భీకరంగా కనిపిస్తు చేతిలో కత్తులు ఉండటంతో ఫ్యాన్స్ లో అంచనాలు పెరుగుతూ ఉన్నాయి. దీంతో ఈ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. 

తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్తో పాటు రిలీజ్పై అప్డేట్ ఇచ్చారు మేకర్స్.ఈ క్రైమ్ థ్రిల్లర్ నుంచి మే 9న అదిరిపోయే వాల్యుమ్తో ఫస్ట్ పాట వచ్చేస్తుంటూ రావణుడి ఫోటోతో ఉన్న ధనుష్ పోస్టర్ రిలీజ్ చేశారు.ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.ధనుష్ ఫ్యాన్స్ ఓ సారి ఊహించేసుకోండి. ఇక మీ అంచనాలే!

ఈ సినిమాలో దుసారా విజయన్, సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్, ఎస్.జె.సూర్య, అపర్ణ బాలమురళి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.తమిళం,తెలుగు,హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమా జూన్ 13న గురువారం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.ఓం ప్రకాష్ సినిమాటోగ్రఫీ, జాకీ ఆర్ట్ డైరెక్టర్, పీటర్ హైన్ ఈ చిత్రానికి ఫైట్ మాస్టర్ గా వ్యవహరించాడు.ప్రస్తుతం ధనుష్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కుబేర మూవీలో నటిస్తున్నాడు.