MI vs SRH: టాస్ గెలిచిన ముంబై.. సన్‌రైజర్స్ జట్టులో కీలక మార్పు

MI vs SRH: టాస్ గెలిచిన ముంబై.. సన్‌రైజర్స్ జట్టులో కీలక మార్పు

ఐపీఎల్ 2024లో భాగంగా సోమవారం(మే 06) ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. బ్యాటర్లకు స్వర్గధామమైన ముంబైలోని వాంఖడే పిచ్‌ పై ఈ మ్యాచ్ జరుగుతోంది. ఫుల్‌ స్వింగ్‌లో ఉన్న హైదరాబాద్‌ బ్యాటర్లు.. ఇప్పటికే ఓసారి ముంబై బౌలర్లను ఊచకోత కోశారు. ఇప్పుడు మళ్లీ అదే జట్టుతో ఆడబోతున్నారు. దీంతో హోరాహోరీ పోరు తప్పకపోవచ్చు. 

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై సారథి హార్దిక్ పాండ్యా.. సన్‌రైజర్స్ బ్యాటర్లను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఇరు జట్లు ఒక్కో మార్పుతో బరిలోకి దిగుతున్నాయి.  

తుది జట్లు

ముంబై: ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రోహిత్ శర్మ, నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), టిమ్ డేవిడ్, అన్షుల్ కాంబోజ్, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా, నువాన్ తుషార.

హైదరాబాద్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, మయాంక్ అగర్వాల్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), నితీష్ రెడ్డి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, మార్కో జాన్సెన్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, నటరాజన్.