సిటిజన్ షిప్ నిరసన ర్యాలీలు ఆగలేదు కానీ.. ప్రశాంతమే!

సిటిజన్ షిప్ నిరసన ర్యాలీలు ఆగలేదు కానీ.. ప్రశాంతమే!

చెన్నై, కోల్కతాబెంగళూరు:

సిటిజన్​షిప్​ లొల్లి ఇంకా పూర్తిగా చల్లారలేదు.. ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్నా, పోలీ సులు ఎక్కడికక్కడ కట్టడి చేయడంతో హింసాత్మక ఘటనలు జరగలేదు. ఢిల్లీలో ర్యాలీలు, నిరసనలు, ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆదివారం వందలాది మంది రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జామియా మిలియా స్టూడెంట్లకు మద్దతుగా దక్షిణ ఢిల్లీలో జనం ర్యాలీ తీశారు. సీసీఏను రద్దు చేయాలని డిమాండ్‌‌‌‌ చేశారు. నిజాముద్దీన్‌‌‌‌ వద్ద స్టూడెంట్లు నిరసనకు దిగారు. మంగళూరులో పరిస్థితి అదుపులోకి రావడంతో కర్ఫ్యూ సడలించారు. తమిళనాడులో నిరసనలు కొనసాగాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వివిధ ఇస్లామిక్​ సంస్థలకు చెందిన 500 మంది నిరసన ప్రదర్శనలు చేశారు. పశ్చిమ బెంగాల్​లో ఆదివారం ప్రశాంతత నెలకొంది.పలు పార్టీల నేతలు, కార్యకర్తలు చట్టానికి అనుకూలంగా, వ్యతిరేకంగా ర్యాలీలు తీశారు. మహారాష్ట్రలోని నాగ్​పూర్​లో సీఏఏ చట్టానికి అనుకూలంగా భారీ ర్యాలీ నిర్వహించారు. బెంగళూర్​లో సీఏఏ చట్టానికి అనుకూలంగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న ఓ యువకుడిపై నిరసనకారులు దాడి చేశారు.
జేడీఎస్ తరఫున ఆ పార్టీ​ చీఫ్​ కుమారస్వామి బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేశారు.

మంగళూరు ప్రశాంతం..

ఆందోళనలతో అట్టుడికిన మంగళూరు ఆది వారం ప్రశాంతంగా కనిపించింది. ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు వరకు పోలీసులు కర్ఫ్యూ సడలించారు. శనివారం రాత్రి నుంచి మొబైల్‌‌‌‌‌‌‌‌, ఇంటర్నెట్‌‌‌‌‌‌‌‌ సర్వీసులు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఆదివారం ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగలేదని, పరిస్థితి ప్రశాంతంగా ఉందని పోలీసులు చెప్పారు. గురువారం జరిగిన ఆందోళనల్లో ఇద్దరు నిరసనకారులు చనిపోవడంతో ముందు జాగ్రత్త చర్యగా అధికారులు ఇంటర్నెట్​ను బ్యాన్​ చేసి, కర్ఫ్యూ విధించారు. పరిస్థితులు కంట్రోల్​అయిన నేపథ్యంలో కర్ఫ్యూ సడలించారు. కర్నాటక మాజీ సీఎం, జేడీఎస్‌‌‌‌‌‌‌‌ నేత కుమారస్వామి చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించారు. పార్టీ తరఫున ఒక్కో కుటుంబానికి ఐదులక్షల రూపాయల చెక్కులను అందించారు.

సపోర్టర్​పై దాడి

బెంగళూరులోని జేపీ నగర్​కు చెందిన యువకుడు వరుణ్​పై నిరసనకారులు దాడి చేశారు. సీఏఏ కు సపోర్ట్​గా తీసిన ర్యాలీలో పాల్గొని తిరిగొస్తున్న వరుణ్​ను అడ్డుకుని, పదునైన ఆయుధాలతో దాడి చేసి పారిపోయారు. బాధితుడిని పోలీసులు దగ్గర్లోని ఆస్పత్రిలో చేర్పించారు. వరుణ్​ ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్లు చెప్పారు. సంఘటనా స్థలం చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజిని పరిశీలిస్తూ వరుణ్​పై దాడి చేసిన వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.