కరోనా వ్యాక్సిన్.. ఇంట్రెస్ట్ చూపించని జనం

కరోనా వ్యాక్సిన్.. ఇంట్రెస్ట్ చూపించని జనం
వ్యాక్సిన్ వచ్చినా ఇప్పుడే వేసుకోం దేశంలో 69 శాతం మంది అభిప్రాయమిది టీకా ఎఫిషియెన్సీ, సైడ్ ఎఫెక్ట్స్​పై అనుమానం లోకల్ సర్కిల్స్ సంస్థ సర్వేలో వెల్లడి జీవోక్యూఐఐ సర్వేలోనూ 53% మంది నో ఇంట్రెస్ట్ మన దేశంలో కరోనా వ్యాక్సిన్‌ వచ్చినా ఇప్పుడే వేసుకోబోమని చాలా మంది అంటున్నారు. లోకల్‌ సర్కిల్స్‌ అనే సంస్థ చేపట్టిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. 69 శాతం మంది వెంటనే వ్యాక్సిన్​ వేసుకోబోమని చెప్పారు. 31 శాతం మంది మాత్రమే ఓకే అన్నారు. జీవోక్యూఐఐ అనే సంస్థ నిర్వహించిన సర్వేలోనూ దాదాపు ఇలాంటి అభిప్రాయాలే వ్యక్తమయ్యాయి. హైదరాబాద్‌, వెలుగు: కరోనా వ్యాక్సిన్‌ వేసుకోవడంపై లోకల్‌ సర్కిల్స్‌ సంస్థ దేశవ్యాప్తంగా ఈ ఏడాది అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు వరుసగా సర్వే చేస్తూ వచ్చింది. ‘‘కరోనా టీకా వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థల ద్వారా అందుబాటులోకి వచ్చే చాన్స్‌ ఉంది. టీకా వస్తే మీరు వేయించుకుంటరా?’’ అనే ప్రశ్న అక్టోబర్‌ 15 నుంచి 20 మధ్య జరిపిన సర్వేలో వేసింది. దీనికి జవాబుగా.. 61 శాతం మంది వెంటనే టీకా వేసుకోబోమని స్పష్టం చేశారు. ఆ తర్వాత ఫైజర్‌, మోడెర్నా, ఆస్ట్రా జెనికా వ్యాక్సిన్ లో సక్సెస్‌ కనిపించింది. దీంతో ఇదే ప్రశ్నపై మళ్లీ నవంబర్‌ 23 నుంచి 28 మధ్య సర్వే చేయగా.. 61 శాతం నుంచి 59 శాతానికి తగ్గారు. ఇక డిసెంబర్ లో మరోసారి సర్వే నిర్వహించారు. 69 శాతం మంది వెంటనే వ్యాక్సిన్ వేసుకోబోమని చెప్పారు. వ్యాక్సిన్ వచ్చినా మూడు నుంచి ఆరు నెలలు వెయిట్ చేస్తామని కొందరు, 6 నుంచి 12 నెలలు వెయిట్ చేస్తామని మరికొందరు చెప్పారు. ఎప్పటికీ వేసుకోబోమని 6 శాతం మంది స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా 242 జిల్లాల్ లో ఆన్ లైన్‌ ద్వారా లోకల్ సర్కిల్స్ సంస్థ సర్వే నిర్వహించగా.. 18,000 మంది పాల్గొన్నారు. వీరిలో 66 శాతం పురుషులు, 34 శాతం మంది మహిళలు ఉన్నారు. ఎందుకు వద్దంటున్నరు? దేశంలో రోజుకురోజుకు కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కరోనా ప్రారంభంతో పోలిస్తే ఇప్పుడు 60 శాతం మేర కేసులు తగ్గాయి. త్వరలో ప్రతి రోజు 20 వేల కేసులకే పరిమితమయ్యే చాన్స్‌ ఉందని ఎక్స్​పర్ట్స్​ అంచనా వేస్తున్నారు. ఇలా కేసులు తగ్గుతుండటంతో వ్యాక్సిన్‌పై  జనం ఇంట్రెస్ట్‌ చూపించడం లేదని లోకల్​ సర్కిల్స్​ సంస్థ సర్వేలో తేలింది.  ఇండియన్స్​లో హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చినట్లు చాలా మంది భావిస్తున్నారని, అది కూడా ఒక కారణమని సంస్థ పేర్కొంది. వ్యాక్సిన్​ తో సైడ్‌ ఎఫెక్ట్స్‌ రావొచ్చన్న అనుమానం కూడా  జనంలో ఉందని తెలిపింది. జీవోక్యూఐఐ సర్వేలోనూ.. కరోనా వ్యాక్సిన్‌ తీసుకోవడంపై జీవోక్యూఐఐ అనే సంస్థ కూడా సర్వే నిర్వహించింది. సర్వేలో మొత్తం 11వేల మంది నుంచి ఒపీనియన్‌ తీసుకుంది. దీనిలో 53% మంది టీకా వేసుకోవడం గురించి ఏం చెప్పలేమన్నారు. రిజల్ట్స్‌ చూసిన తర్వాత 43% మంది ఫైనల్‌ డెసిషన్‌ తీసుకుంటామని చెప్పగా.. 10% మంది దీనికి వ్యతిరేకంగా ఉన్నట్లు పేర్కొన్నారు. 45 నుంచి 60 ఏండ్ల మధ్య, 60 ఏండ్లకు పైబడిన వారు వ్యాక్సిన్‌ వేసుకోవడానికి సిద్ధంగా లేరని సర్వేలో వెల్లడైంది. ‘‘ఇక రోజువారీ కేసులు తగ్గడానికి ప్రధాన కారణం ఏమిటని భావిస్తున్నారు..?’’ అని లోకల్‌‌ సర్కిల్స్‌‌ సంస్థ సర్వేలో ప్రశ్నించింది. తామంతా హెర్డ్‌‌ ఇమ్యూనిటీ వైపు వెళ్తున్నామని 17 శాతం మంది భావించగా, ఇండియన్స్​కు  సాధారణంగానే హై ఇమ్యూనిటీ ఉంటుందని 14 శాతం మంది, వైరస్‌‌ వీక్‌‌గా ఉందని లేదా అది వెళ్లిపోతోందని 8 శాతం మంది అభిప్రాయపడ్డారు. మాస్క్‌‌లు ధరించడం, సోషల్‌‌ డిస్టెన్స్‌‌ లాంటి రూల్స్​ పాటించడంతో కేసులు తగ్గుతున్నాయని 15 శాతం మంది అనగా, మరేదో కారణమై ఉండొచ్చని 8 శాతం మంది పేర్కొన్నారు. ఇక అధికారిక కరోనా లెక్కలు చూస్తుంటే చాలా మంది టెస్ట్‌‌లు చేయించుకోవడం లేదనే విషయం అర్థమవుతోందని 33 శాతం మంది చెప్పగా, 5 శాతం మంది మాత్రం ఎలాంటి ఒపీనియన్‌‌ తెలియజేయలేదు. హెల్త్‌‌ ప్రొఫెషనల్స్‌‌పై చేసిన సర్వేలోనూ నో ఇంట్రెస్ట్‌‌ హెల్త్‌‌ కేర్‌‌ ప్రొఫెషనల్స్‌‌(జనరల్‌‌ ఫిజీషియన్స్‌‌, సర్జన్స్‌‌, మెడిసిన్ స్పెషలిస్టులు, డెంటిస్టులు, పారామెడిక్స్‌‌, నర్సులు, మెడికల్‌‌ స్టూడెంట్స్‌‌)పై లోకల్‌‌ సర్కిల్స్‌‌ సంస్థ మరో స్పెషల్‌‌ ఇండిపెండెంట్‌‌ సర్వే చేయించింది. ఇందులో ‘‘కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా..?’’ అని హెల్త్‌‌ ప్రొఫెషనల్స్‌‌ను అడిగింది. దీనికి 55 శాతం మంది ఆసక్తి లేదని స్పష్టం చేశారు. ఎందుకు ఇంట్రెస్ట్‌‌ లేదని మరో ప్రశ్న వేయగా.. పలు విషయాలను వెల్లడించారు. 15.01 శాతం మంది సైడ్‌‌ ఎఫెక్ట్స్‌‌పై ఆందోళన వ్యక్తం చేశారు. టీకా ఎఫిషియన్సీపై కచ్చితంగా చెప్పలేమని 7.75 శాతం మంది చెప్పగా, ఈ రెండు కారణాలతో ఇంట్రెస్ట్‌‌ చూపడంలేదని 38.26 శాతం మంది పేర్కొన్నారు. ఇక 38.9 శాతం మంది హెల్త్‌‌ ప్రొఫెషనల్స్‌‌ మాత్రం వ్యాక్సిన్‌‌ అందుబాటులోకి వస్తే వేయించుకుంటామని స్పష్టం చేశారు. ఈ సర్వేలో మొత్తం 1,406 మంది ప్రొఫెషనల్స్‌‌ పాల్గొనగా.. ఇందులో 57 శాతం మంది మహిళలు, 43మంది పురుషులు ఉన్నారు.