దేశ సరిహద్దుల్లో ‘సీసీటీవీ’ గూఢచర్యం..! హైవేపై కెమెరా పెట్టి ఆర్మీ రహస్యాలను పాకిస్తాన్‎కు చేరవేత

దేశ సరిహద్దుల్లో ‘సీసీటీవీ’ గూఢచర్యం..! హైవేపై కెమెరా పెట్టి ఆర్మీ రహస్యాలను పాకిస్తాన్‎కు చేరవేత

పఠాన్‌‌‌‌‌‌‌‌కోట్: భారత సైన్యం, పారామిలటరీ దళాల కదలికలపై నిఘా ఉంచి, ఆ సమాచారాన్ని పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌కు చేరవేస్తున్న ఒక అనుమానిత గూఢచారిని పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పఠాన్‌‌‌‌‌‌‌‌కోట్‌‌‌‌‌‌‌‌కు చెందిన బల్జీత్ సింగ్ అలియాస్ బిట్టూ అనే వ్యక్తి పఠాన్‌‌‌‌‌‌‌‌కోట్–జమ్మూ జాతీయ రహదారి (ఎన్​హెచ్–-44) పై ఉన్న ఒక వంతెన సమీపంలో సీసీటీవీ కెమెరాను అమర్చాడు. ఈ కెమెరా లైవ్ ఫీడ్‌‌‌‌‌‌‌‌ను పాకిస్తాన్, ఇతర విదేశాల్లోని ఆపరేటివ్‌‌‌‌‌‌‌‌లకు చేరవేశాడు. 

దుబాయ్‌‌‌‌‌‌‌‌కు చెందిన ఒక అపరిచిత వ్యక్తి ఆదేశాల మేరకు ఈ ఏడాది జనవరిలో ఈ కెమెరాను ఏర్పాటు చేశానని, ఇందుకు తనకు రూ.40 వేలు ఇచ్చినట్లు నిందితుడు అంగీకరించాడు. అతడి నుంచి ఒక సీసీటీవీ కెమెరా, వైఫై రూటర్‌‌‌‌‌‌‌‌ను పోలీసులు స్వాధీనం 
చేసుకున్నారు. మొత్తం నలుగురిపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.